బంగారం ధర సోమవారం రూ.182 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.51,740 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దేశీయంగా ధరలు పుంజుకున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.
వెండి ధర కిలోకు భారీగా రూ.805 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,714 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,909 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సుకు 24.64 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:బ్యాంగింగ్ షేర్లు భళా- సెన్సెక్స్ 449+