పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.78 పెరిగి రూ.43,513గా ఉంది. వెండి ధర కూడా రూ.35 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.48,130గా ఉంది.
"అంతర్జాతీయంగా బంగారం ధరల రికవరీతో... దేశీయంగానూ పసిడి ధరలు పెరిగాయి. కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో మదుపరులు సురక్షితమైన పసిడిపై మదుపు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు."- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
అంతర్జాతీయంగా
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,649 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 18.05 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఐదో రోజూ అదే తీరు.. నష్టాల్లోనే మార్కెట్లు