పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 21 పెరిగి.. రూ. 49,644కు చేరింది.
కిలో వెండి ధర మాత్రం రూ. 259 తగ్గి.. రూ. 66,784 గా ఉంది.
అంతర్జాతీయంగా పసిడికి సానుకూలంగా డిమాండ్ ఉందని విశ్లేషకులు చెప్పారు. అందువల్లే దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా మార్పుచెందాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,879 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.71 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.
ఇదీ చదవండి: ఒడుదొడుకుల ట్రేడింగ్‌లోనూ రికార్డు గరిష్ఠాలు