మళ్లీ పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలు ఇవే.. - పది గ్రాముల బంగారం ధర
బంగారం, వెండి ధరల వరుస తగ్గుదలకు బ్రేక్ పడింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర శుక్రవారం మళ్లీ రూ.51 వేలకు చేరువైంది. వెండి కిలోకు భారీగా రూ.2,100కు పైగా పెరిగింది.
ప్రస్తుత బంగారం, వెండి ధరలు
నాలుగు రోజులపాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర శుక్రవారం రూ.324 పెరిగి.. రూ.50,824 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికవరీ అవుతుండటం వల్ల.. దేశీయంగానూ పుత్తడి ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర శుక్రవారం కిలోకు భారీగా రూ.2,124 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.60,536 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,873 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు స్వల్పంగా తగ్గి 23.10 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:ఆ విమానాల్లో జియో మొబైల్ సేవలు- ప్లాన్లు ఇవే