అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతిమంత్రం పటించటం వల్ల గ్లోబల్ ఈక్విటీల కొనుగోలుకు మదుపరులు మొగ్గుచూపారు. రూపాయి బలపడటం, అంతర్జాతీయం సానుకూల పరిస్థితులతో నేడు పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. దిల్లీలో 10 గ్రాముల పుత్తడి రూ.766 పతనమై 40,634 వద్దకు చేరింది.
బంగారం దారిలోనే వెండి ధర సైతం భారీగా తగ్గింది. దిల్లీలో కిలో వెండి రూ.1,148 తగ్గి రూ.47,932కి చేరుకుంది. అయితే వివాహాల సీజన్ ఉన్నందున రిటైల్ మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.