పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52 పెరిగి రూ.41,508కు చేరుకుంది. కిలో వెండి ధర కూడా రూ.190 పెరిగి రూ.47,396గా ఉంది.
"రూపాయి హెచ్చుతగ్గులకు తోడు, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం వల్ల దేశీయంగానూ పసిడి, వెండి ధరలు పెరిగాయి."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్
అంతర్జాతీయంగా
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,574 డాలర్లు, ఔన్స్ వెండి ధర 17.80 డాలర్లుగా ఉంది.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా మదుపరులు సురక్షితమైన బంగారం వైపు మళ్లుతున్నారని తపన్ తెలిపారు.
ఇదీ చూడండి: వెంటాడిన కరోనా భయం- మార్కెట్లకు నష్టం