పసిడి ధరల పరుగు నేడు కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.101 తగ్గి.. రూ.39,213కి చేరింది.
రూపాయి పుంజుకోవడం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడమే ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
కిలో వెండి ధర(దిల్లీలో) నేడు రూ.29 తగ్గి.. రూ.47,580 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,505 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సుకు 18.4 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: లోగో మార్చిన ఫేస్బుక్.. ఎందుకో తెలుసా?