బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.281 తగ్గి.. రూ.41,748కి చేరింది.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండు లేమి, ధరల్లో తగ్గుదల వంటి పరిణామాలు.. దేశీయంగా బంగారం ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు .
బంగారంతో పాటే వెండి ధర నేడు క్షీణించింది. కిలో వెండి ధర నేడు రూ.712 (దిల్లీలో) తగ్గి.. రూ.48,218 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,578 డాలర్లకు తగ్గగా.. వెండి ఔన్సుకు 17.78 డాలర్లకు చేరింది.