బంగారం ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.241 పెరిగి.. రూ.45,520కు చేరింది.
కిలో వెండి ధర రూ.781 వృద్ధితో రూ.68,877కు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,753 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 26.90 డాలర్ల వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు కోలుకోవడం, రూపాయి విలువ బలపడడం కారణంగా బంగారం వెల పెరిగినట్లు మార్కెట్ల్ విశ్లేషకులు తెలిపారు.