బంగారం ధర గురువారం భారీగా రూ.575 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,125 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,227 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,699 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,870.50 డాలర్లకు పెరిగింది. వెండి ధర 25.83 డాలర్లకు ఎగిసింది.
ఇదీ చూడండి:20 కోట్లు దాటిన నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు