బంగారం, వెండి ధరలు శుక్రవారం అమాంతం పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.441 పెరిగి.. రూ.48,530కు ఎగిసింది.
పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.1,148 పెరిగి.. కిలో రూ.71,432కు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరల్లో పెరుగుదలే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర స్వల్పంగా పెరిగి 1,896 డాలర్లకు చేరగా.. ఔన్సు వెండి ధర 28.15 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: క్రెడిట్ స్కోరు తగ్గకుండా చూసుకోవటం ఎలా?