పసిడి ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర శుక్రవారం భారీగా రూ.614 తగ్గి.. రూ.49,763కు చేరింది.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పుత్తడికి తగ్గిన డిమాండ్ కారణంగా దేశీయంగానూ పసిడి ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కిలో వెండి ధర(దిల్లీలో) ఏకంగా రూ.1,619 పతనమైంది. ప్రస్తుతం రూ.67,518గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,889 డాలర్లకు తగ్గింది. వెండి రేటు ఔన్సుకు 26.68 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.
ఇదీ చదవండి: బీఎస్ఈ కంపెనీల ఎం-క్యాప్ ఆల్‌టైం రికార్డ్