ETV Bharat / business

అత్యవసరం తప్పక బంగారం తాకట్టు

author img

By

Published : May 29, 2021, 9:35 AM IST

కరోనా కాలంలో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది అప్పులు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా కొవిడ్​ సోకితే అత్యవసరాల కోసమని బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. కొవిడ్​ తరువాత ఇలా తనఖా పెట్టి చేసిన అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.

Gold mortgage, covid crises
బంగారం తాకట్టు

కరోనా తొలి దశ.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ తర్వాత ఏడాదిగా ఎంతో మందిపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం పడింది. సాధారణ పౌరులు, ఉద్యోగులు, వ్యాపారులకూ ఆదాయాలు తగ్గడంతో, ఖర్చులు తట్టుకునేందుకు చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చవుతుండటంతో అత్యవసరంగా నగదు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తోండటం ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. అందుకే, ప్రతి కుటుంబంలోనూ ఎంతోకొంత బంగారం తప్పనిసరిగా ఉంటుంది. అవసరం అయినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవడం అనాదిగా వస్తున్నదే. గత ఏడాది కాలంలో ఇది మరింత పెరిగింది. వ్యక్తిగత రుణాలు.. ఇతర హామీ అవసరం లేని అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్న నేపథ్యంలో బంగారమే ఎంతోమందిని ఆదుకుంటోంది.

నిమిషాల్లోనే మంజూరు..

కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరాలంటే.. అప్పటికప్పుడు కనీసం రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకైనా చెల్లించాల్సి రావడం చూస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద మొత్తం చాలామంది దగ్గర అందుబాటులో ఉండదు. చేతిలో పసిడి ఉన్న వారు బ్యాంకుకు లేదా బంగారంపై రుణం ఇచ్చే సంస్థల దగ్గరకు వెళ్తే.. కనీసం 30 నిమిషాల నుంచి గరిష్ఠంగా గంటలోపే డబ్బు చేతికి వస్తుంది. ఇదీ బంగారంపై రుణాలు ఎక్కువగా తీసుకునేందుకు కారణం అవుతోంది. పైగా బంగారం మార్కెట్‌ రేటులో దాదాపు 75శాతం వరకూ రుణం లభిస్తుంది. మార్చి 31 వరకూ పసిడి విలువలో దాదాపు 90శాతం వరకూ రుణం లభించింది.

వడ్డీ తక్కువగా ఉండటం..

పసిడి హమీతో తీసుకున్న రుణాలకు బ్యాంకులు వార్షిక వడ్డీ 9-12శాతం మధ్య వసూలు చేస్తుండగా.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు 15-18% తీసుకుంటున్నాయి. వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పుడు నెలనెలా వాయిదాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, బంగారం రుణాలకు ఆ ఇబ్బంది ఉండదు. వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లిస్తూ.. వీలైనప్పుడు అసలు చెల్లింపులు చేస్తూ వెళ్లొచ్చు. ఈ వెసులుబాటు ఉండటంతో అత్యవసరాల్లో పసిడిని తాకట్టు పెట్టేందుకే ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు.

రూ.60వేల కోట్లు..

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకులు కేవలం బంగారం తనఖాపైనే రూ.60,464 కోట్ల అప్పు ఇచ్చాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ.33,303 కోట్లతో పోలిస్తే ఇది 82శాతం అధికం. ముఖ్యంగా 2020లో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ ముగిశాక పసిడి తనఖా రుణాల్లో ఒక్కసారిగా వృద్ధి కనిపించిందని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొన్నారు. ఈసారీ కొవిడ్‌-19 వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన డబ్బు కోసం బంగారాన్నే ఆశ్రయిస్తారని.. కాబట్టి, ఈసారీ ఈ రుణాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

నోటీసులు వస్తున్నాయి..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారం అప్పు నిర్ణీత మొత్తం దాటినప్పుడు లేదా వ్యవధి తీరినా.. పునరుద్ధరణ చేసుకోనప్పుడు.. తాకట్టులో ఉన్న ఆభరణాలను వేలం వేస్తామని ఖాతాదారులకు నోటీసులు ఇస్తుంటాయి. ఇటీవల ఇవి బాగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్‌, మేలలో రుణాలు తీసుకున్న వారికి ఇప్పటికే ఈ నోటీసులు వస్తున్నాయి. బంగారం ధర గరిష్ఠంగా రూ.57,000 ఉన్నప్పుడు రుణాలు తీసుకున్న వారూ.. ఇప్పుడు ధర తగ్గడంతో విలువ-రుణ నిష్పత్తి ఆధారంగా కొంత చెల్లించాలని బ్యాంకులు డిమాండ్‌ నోటీసులు పంపిస్తున్నాయి. రుణగ్రహీతల నుంచి సమాధానం రాకపోతే.. నిబంధనల మేరకు వేలం వేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి: పసిడి ఎక్స్ఛేంజీ ఏర్పాటుకు నిబంధనలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.