బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.402 ఎగిసి.. రూ.47,235 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం కారణంగా ఆ ప్రభావం దేశీయంగా పడింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు మంగళవారం రూ.893(దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,344 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,705 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.63 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఆ చమురు సంస్థలో 10 వేల ఉద్యోగాలు కట్!