దిల్లీలో బుధవారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.148 తగ్గి రూ.46,307గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 886 క్షీణించి రూ.68,676కు చేరింది.
శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,807 డాలర్లు, ఔన్సు వెండి ధర 27.63 డాలర్లుగా ఉంది.