బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.136 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,813 వద్దకు చేరింది.
రూపాయి పుంజుకోవడం సహా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గడం వంటివి.. దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చేందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.346 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,343 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,842 డాలర్ల వద్ద, వెండి ధర 24.20 డాలర్ల వద్ద ఉన్నాయి.
ఇదీ చూడండి:వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథమే