బంగారం ధర మరింత తగ్గింది. నేటి లెక్కల ప్రకారం దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.128 తగ్గి.. రూ.44,490కి చేరింది.
అంతర్జాతీయంగా పుత్తడి ధరలు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయంగా ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి ధర కూడా నేడు కిలోకు (దిల్లీలో) రూ.302 తగ్గి.. రూ.46,868వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,645 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 16.73 డాలర్లుగా వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:ఆరోగ్య బీమా పరిధిలోకి కరోనా చికిత్స- కేంద్రం నిర్ణయం