దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.142 తగ్గి... రూ.47,483కు చేరింది.
బంగారం బాటలోనే వెండి పయనించింది. కిలో వెండి ధర రూ.701 తగ్గి.. రూ.57,808కు దిగొచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,781 డాలర్లుగా, వెండి ధర 22.29 డాలర్లుగా ఉంది.
కరోనా టీకా తయారీలో పురోగతితో మదుపరులు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతుండటం వల్ల బంగారం ధర క్రమంగా తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: అదిరే ఫీచర్లతో మోటోజీ 5జీ