దిల్లీలో గురువారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.358 తగ్గి రూ.45,959గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 151 పెరిగి రూ.69,159కు చేరింది.
శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,792 డాలర్లు, ఔన్సు వెండి ధర 27.56 డాలర్లుగా ఉంది.