బంగారం ధర గురువారం స్వల్పంగా రూ.95 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.51,405 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గటం, గురువారం.. రూపాయి స్వల్పంగా పుంజుకోవడం వంటి పరిణామాలు దేశీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.504 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,425 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,918 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:ఆశాజనకంగా 'రియల్టీ' భవిష్యత్ అంచనాలు