యాపిల్, గూగుల్ యాప్ స్టోర్లు 2019 మొదటి సగ భాగంలో భారీగా ఆర్జించాయి. ఈ ఆరు నెలల్లో యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ 39.7 బిలియన్ డాలర్లు సంపాదించాయి. గతేడాది (34.4 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే 15.4 శాతం వృద్ధి సాధించాయని మొబైల్ యాప్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది.
యాపిల్‌దే పైచేయి
యాపిల్ యాప్ స్టోర్‌లోనే వినియోగదారులు అత్యధికంగా ఖర్చు పెట్టారు. ఈ 6 నెలల్లో 25.5 బిలియన్ డాలర్లు అర్జించింది. గూగుల్ ప్లే మాత్రం 14.2 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకుంది.
యాప్‌లలో..
గేమింగ్యేతర యాప్‌లలో డేటింగ్ యాప్ 'టిండర్' అత్యధికంగా సంపాదించింది. ఈ రెండు స్టోర్ల ద్వారా 497 మిలియన్ డాలర్లతో గతేడాది కన్నా 32 శాతం వృద్ధి నమోదు చేసింది.
తర్వాత నెట్‌ఫ్లిక్స్ 399 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఐఓఎస్ వెర్షన్ యాప్‌లో సబ్స్క్రిప్షన్ తొలగింపు నిర్ణయంతో రెండో త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం కొంతమేర తగ్గింది.
డౌన్లోడ్లలో వాట్సాప్
అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లలో ఫేస్‌బుక్‌తో పాటు ఆ సంస్థకు చెందిన వాట్సాప్, మెసెంజర్ మొదటి 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ను వెనక్కునెట్టిన టిక్‌టాక్ నాలుగో స్థానంలో స్థిరపడింది.
నిషేధంతో మరింత పైకి..
బీజింగ్ ఆధారిత అంకుర సంస్థ బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌కు ఈ ఏడాది కొత్త డౌన్లోడ్లు 28 శాతం పెరిగాయి. భారత్‌లో రెండు వారాలు నిషేధాన్ని ఎదుర్కొన్నా ప్రపంచ వ్యాప్తంగా 34.4 కోట్ల మంది ఈ వీడియో యాప్‌ను అక్కున చేర్చుకన్నారు.
ఇదీ చూడండి: 'పబ్జీ లైట్' ఆడితే.. జియో రివార్డుల పంట!