ETV Bharat / business

శ్వాసకోస వ్యాధులకు 'గ్లెన్​మార్క్ రియాల్ట్రిస్' - గ్లెన్​మార్క్ ఫార్మా

ముక్కు ద్వారా అందించే రియాల్ట్రిస్‌ అనే ఔషధాన్ని గ్లెన్​మార్క్ ఫార్మా భారత్​లో విడుదల చేసింది. మధ్యస్థాయి నుంచి.. తీవ్రమైన అలెర్జీల చికిత్సకు దీనిని ఉపయోగించవచ్చని సంస్థ ప్రకటించింది.

Glenmark Pharma launches nasal spray Ryaltris in India
'గ్లెన్​మార్క్ రియాల్ట్రిస్'
author img

By

Published : May 3, 2021, 12:54 PM IST

శ్వాసకోశ సంబంధిత ఔషధ విభాగంలో సింహభాగం వాటాను కలిగి ఉన్న గ్లెన్​మార్క్.. మధ్యస్థాయి నుంచి తీవ్రమైన అలెర్జీ సంబంధిత చికిత్సలకు ఉపయోగించే ఔషధ జెనరిక్ రకాన్ని అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొట్టమొదటి సారిగా అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఔషధంతో శ్వాసకోస రోగులు మెరుగైన చికిత్స పొందగలరని నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది.

ఈ తరహా ఔషధాల్లో టాప్ పది బ్రాండ్ల సగటు ధర(75ఎండీ) రూ.365గా ఉండగా.. గ్లెన్​మార్క్ విడుదల చేసిన 'రియాల్ట్రిస్ నాసికా స్ప్రే'(నాజిల్ స్ప్రే) ప్రారంభ ధర రూ.175 మాత్రమేనని తెలిపింది.

"గ్లెన్​మార్క్ విడుదల చేసే ఈ ఔషధం శ్వాసకోస సంబంధిత వ్యాధులలో సమర్థమంతమైన ఉత్పత్తిగా నిలుస్తుంది. అంతేగాక దేశంలోని రోగులకు సరసమైన ధరలో అలెర్జీలకు ఔషధం అందుబాటులో ఉంటుంది."

-అలోక్ మాలిక్, ఇండియా ఫార్ములేషన్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్

ఈ ప్రకటనతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేరు ధర బీఎస్‌ఈలో 0.14 శాతం పెరిగి రూ.577.45 వద్ద ట్రేడవుతోంది.

ఇవీ చదవండి: ఊబకాయానికి విప్లవాత్మక ఔషధం!

కొవిడ్​ను రెండు రోజులు అడ్డుకునే నాసల్​ స్ప్రే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.