ETV Bharat / business

ఔషధ రంగంలోకి గెయిల్‌! - api

ఔషధ రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రణాళికలకు రచిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా. ఔషధాల తయారీలో ముడి సరకుగా వాడే ఏపీఐలను తయారు చేయాలని యోచిస్తోంది. దానికి కావాల్సిన పెట్టుబడులు, వ్యాపార ప్రణాళికల కోసం ఐక్యూవీఐఏ అనుబంధ సంస్థ సాయం పొందనుంది.

gail india, api
ఔషధ రంగంలోకి గెయిల్‌ ఇండియా, ఏపీఐ
author img

By

Published : Apr 18, 2021, 7:49 AM IST

ప్రభుత్వ రంగ సహజవాయువు (గ్యాస్‌) పంపిణీ సంస్థ గెయిల్‌ ఇండియా ఔషధ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉంది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంగ్రేడియంట్స్‌ను (ఏపీఐ) గెయిల్‌ తయారు చేయాలని అనుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఔషధాలు, ఫార్ములేషన్లు, ఇంటర్మీడియట్స్‌ తయారీలో ఏపీఐలను ముడి సరకుగా ఉపయోగిస్తారు. ఏయే ఏపీఐలు తయారు చేయాలి, ఎంత మేర పెట్టుబడులు పెట్టాలనే అంశాలను గెయిల్‌ ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి.

gail india, api
గెయిల్‌ ఇండియా

15 ఏపీఐల గుర్తింపుపై కసరత్తు

ప్రతిపాదిత ఔషధ ప్రాజెక్టుకు సంబంధించి వ్యాపార ప్రణాళిక, పెట్టుబడులపై సలహాలు ఇచ్చేందుకు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన ఐక్యూవీఐఏకు చెందిన భారత అనుబంధ సంస్థను గెయిల్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యూవీఐఏ ఇంక్‌.. లైఫ్‌సైన్సెస్‌పై సలహాలు, సూచనలు చేసే సంస్థ. ఔషధ డేటా కంపెనీ ఐఎంఎస్‌ హెల్త్‌, క్వింటైల్స్‌ విలీనంతో ఈ సంస్థ ఏర్పడింది. ఒక గ్యాస్‌ పంపిణీ సంస్థ తయారు చేయగల కనీసం 15 అత్యవసర ఏపీఐలను గుర్తించే బాధ్యతను భారత్‌లోని ఐక్యూవీఐఏ ఇంక్‌ అనుబంధ సంస్థకు గెయిల్‌ అప్పగించింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అవసరాలపై గెయిల్‌తో సంప్రదింపులు జరిపి, 15 ఉత్పత్తులను ఆ సంస్థ ఎంపిక చేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఆగస్టు కల్లా ప్రణాళిక ఖరారు

తొలి విడత వ్యాపార ప్రణాళిక కింద పోటీ విధాన మదింపు, కొనుగోళ్లకు అవకాశాలు, వ్యూహాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించిన సూచనలను గెయిల్‌కు ఈ సంస్థ అందించనుంది. రెండో విడతలో ప్లాంటు సామర్థ్యం, రసాయన ప్రక్రియ ఎంపిక, మూలధనం, నిర్వహణ వ్యయాలు, స్థల అవసరాలు, ప్రాజెక్టు వ్యయంపై విశ్లేషణ, అమలు ప్రణాళికలను సిఫారసు చేస్తుంది. తుది నివేదికను ఆగస్టు కల్లా అందజేస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి.

gail india, api
ఔషధాలు

అంకురాల్లోనూ పెట్టుబడులు

ఔషధ రంగానికి అవసరమైన ముడి సరుకుల విషయంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతోనే ఔషధ రంగంలో అడుగుపెట్టాలని గెయిల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గెయిల్‌ ఔషధ వ్యాపారం రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఔషధ విభాగ నియంత్రణ పరిధిలోకి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని రంగాల్లోని అంకురాల్లోనూ గెయిల్‌ పెట్టుబడులు పెట్టనుంది. సహజవాయువు, పెట్రోరసాయనాలు, ఇంధనం, ప్రాజెక్టు నిర్వహణ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా మైనింగ్‌, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, నానో మెటీరియల్స్‌ లాంటి రంగాల్లోని అంకుర సంస్థల నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను కూడా ఇప్పటికే గెయిల్‌ ఆహ్వానించింది కూడా.

ఐదింటిలో రెండు సంస్థల మూసివేత

ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఔషధ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకోవడం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే.. ప్రభుత్వ రంగంలోని ఐదు ఔషధ రంగ సంస్థల్లో రెండింటిని- ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, రాజస్థాన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను ప్రభుత్వం మూసివేసింది. మరో మూడింటిలో- హిందుస్థాన్‌ యాంటీ బయాటిక్స్‌, బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, కర్ణాటక యాంటీ బయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌లో వాటాలను ఉపసంహరించింది.

దూసుకెళ్లిన షేర్లు..

ఏడాదికాలంలో ఏపీఐలను తయారు చేసే సంస్థల షేర్లు మదుపర్లకు ఆకర్షణీయ ప్రతిఫలాలను పంచాయి. లారస్‌ ల్యాబ్స్‌, ఆర్తి డ్రగ్స్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, ఐఓఎల్‌ కెమికల్స్‌ లాంటి సంస్థల షేర్లు 100-300% వరకు లాభాలను తెచ్చిపెట్టాయి.

ఇదీ చూడండి: రెమిడెసివిర్​ ధర తగ్గించిన ఫార్మా సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.