ETV Bharat / business

బడ్జెట్: ఆత్మనిర్భర భారతానికి ఆశల పద్దు - ఆత్మనిర్భర భారతానికి ఆశల పద్దు

అగ్రరాజ్యాలకు దీటుగా ఎదగడం సహా స్వయం సమృద్ధ భారతావని లక్ష్యానికి కేంద్రం మరిన్ని బాటలు వేసింది. యావత్‌ ప్రపంచాన్ని కరోనా కకావికలం చేసిన వేళ.. వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఈ రంగానికి ఏకంగా 137 శాతం నిధులను పెంచింది. వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తూ.. అదనపు రుణాలను ప్రతిపాదించింది. వినియోగదారులపై ప్రభావం పడకుండా అగ్రి సెస్ తీసుకొచ్చింది. పెద్దఎత్తున మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.

union budget 2021
కేంద్ర బడ్జెట్ 2021
author img

By

Published : Feb 1, 2021, 8:19 PM IST

భారతదేశ ఆర్థిక రథాన్ని మరో ఏడాది పాటు పరుగులు పెట్టించే మంత్రదండం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ కలలు కనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం బాటలు వేసింది. యావత్‌ ప్రపంచాన్ని కరోనా కకావికలం చేసిన వేళ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. రూ. 34,83,236 కోట్లతో రూపొందించిన బడ్జెట్​ను పార్లమెంట్ ముందు ఉంచారు.

వ్యవసాయానికి

దేశంలోని మెజార్టీ ప్రజలు నమ్ముకున్న వ్యవసాయరంగానికి దన్నుగా నిలిచేందుకు 10 శాతం అదనంగా.. రూ.16.50 లక్షల కోట్ల రూపాయల రుణాలు ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం అగ్రిసెస్​ను విధిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కూడా రూ.30 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచినట్లు ఆమె వివరించారు. నాబార్డ్‌ కింద విడుదలవుతున్న రూ.5000 కోట్ల మైక్రో ఇరిగేషన్‌ నిధులను రూ.10,000 కోట్లకు పెంచుతున్నట్లు వివరించారు. వ్యవసాయ మార్కెట్‌లోకి ఈనామ్‌ తీసుకొచ్చిన పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం చేస్తామన్నారు. తేయాకు తోటల కార్మికుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: పద్దు 2021: 'రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనల నేపథ్యంలో తమ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని సీతారామన్​ స్పష్టం చేశారు. కనీస మద్దతుధర ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ ఉంటుందని చెప్పారు.

వైద్య రంగానికి పెద్దపీట

కరోనా సంక్షోభం వల్ల ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు పెంచింది కేంద్రం. 2021-22కు గానూ దాదాపు రూ.2,23,846 లక్షల కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (రూ.94,452) కేటాయించిన మొత్తంతో పోలిస్తే.. ఇది 137 శాతం అధికం.

ఇదీ చదవండి: బడ్జెట్​ 2021:ఆరోగ్య భారతానికి రూ.2.24 లక్షల కోట్లు

కొత్తగా ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరించారు నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.64 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఈ మొత్తాన్ని వచ్చే ఆరేళ్లలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇది అదనం అని వెల్లడించారు.

దేశంలో ఇప్పటికీ ఎంతోమంది సరైన తిండి లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక మిషన్‌ను ప్రకటించారు నిర్మల. పోషణ్‌ అభియాన్‌, సప్లమెంటరీ న్యూట్రిషన్‌ ప్రొగ్రామ్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 2,700 కోట్లు కేటాయించారు.

fm-ups-infra-healthcare-spending-to-lift-economy-on-union-budget-2021
వైద్య రంగానికి కేటాయింపులు

టీకా పంపిణీకి రూ.35 వేల కోట్లు..

వైరస్‌ నిర్మూలనకు అవసరమైన వ్యాక్సినేషన్‌కూ బడ్జెట్​లో ప్రాధాన్యతనిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. కొవిడ్ టీకా పంపిణీ కోసం రూ.35వేల కోట్లు ప్రతిపాదించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల వివరించారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతామని స్పస్టం చేశారు. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

నిమోనియా తగ్గించేందుకు ఉపయోగించే న్యూమోకోకల్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకే పరిమితమైందని, దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు నిర్మల. తద్వారా ఏటా 50 వేలకుపైగా శిశుమరణాలను తగ్గించవచ్చని వెల్లడించారు.

పన్ను రంగం

తాజా బడ్జెట్​లో వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల జోలికి వెళ్లలేదు కేంద్రం. ఐటీ శ్లాబులు, పన్ను రేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐతే కేవలం పింఛను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ రిటర్న్‌ దాఖలుకు వీరికి మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులే వారి తరఫున పన్ను మినహాయించుకుంటాయని తెలిపారు.

అగ్రి సెస్

సాగు రంగానికి మౌలికవసతుల కల్పన-అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం.. అందుకు నిధులను అగ్రిసెస్ రూపంలో సమీకరించనుంది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్‌, బంగారం సహా దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై అగ్రి ఇన్​ఫ్రా సుంకం విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే ఈ భారం వినియోగదారులపై పడకుండా.. ఎక్సైజ్‌, కస్టమ్స్ సుంకం తగ్గించినట్లు చెప్పారు.

బంగారం, వెండిపై ఇప్పటి వరకూ 12.5 శాతం ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా.. దాన్ని 5 శాతం మేర తగ్గించినట్లు చెప్పారు నిర్మల. ఆ స్థానంలో 2.5 శాతం అగ్రిసెస్ విధించినట్లు వివరించారు. ఇదేవిధంగా బంగారు-వెండి కడ్డీలు, ప్లాటినం, ఆభరణాలు, ఖరీదైన లోహాలు వంటి పలు వస్తువులపై దిగుమతి సుంకం తగ్గించి.. అగ్రి సెస్ విధించారు. ఈ అర్ధరాత్రి నుంచే కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి.

సెస్ పెంచినప్పటికీ, వీటిలో అనేక వస్తువులపై భారీగా దిగుమతి సుంకం తగ్గించడం వల్ల.... వినియోగదారులపై భారం పడకపోగా.. కొన్నింటి ధరలు దిగివస్తాయని నిర్మలా సీతారామన్ వివరించారు.

ఇదీ చదవండి: కేంద్రం కొత్త సెస్- ధరలు మాత్రం పెరగవ్!

దిగుమతి సుంకం పెంచడం, అగ్రి సెస్ విధించడం ద్వారా పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగారం ధరలు తగ్గనుండగా.. ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్​ల ధరలు పెరగనున్నాయి.

రైల్వే

రైల్వేకు బడ్జెట్​లో భారీ కేటాయింపులు చేశారు విత్త మంత్రి. ఈ రంగానికి మొత్తం రూ.1.10 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. దీంట్లో రూ. 1.07 లక్షల కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: రైల్వేకు బూస్ట్​- రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు

నూతన రైల్వే ప్రణాళికలో భాగంగా మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు చర్యలు చేపడతామని సీతారామన్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

రైల్వే శాఖకు సంబంధించి రానున్న పదేళ్ల రోడ్డు మ్యాప్‌ను నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పర్యాటక రూట్లలో రైళ్లకు అధునాతన విస్టాడోమ్‌ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను జత చేయనున్నట్టు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లను 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మౌలిక సదుపాయాలు

వృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021-22 సంవత్సరానికి పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచి.. రూ. 5.5 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు ప్రకటించారు. గత బడ్జెట్​లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 4.12 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని సవరిస్తూ.. రూ. 4.39 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5శాతం పెంపు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మొగ్గు చూపింది కేంద్రం. అసోం, తమిళనాడు, బంగాల్, కేరళ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్రాజెక్టులను ప్రకటించింది. బంగాల్​లో 675 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపింది. మౌలిక వసతుల ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

విద్యా రంగం

దేశభవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు నిర్మలా సీతారామన్. నూతన జాతీయ విద్యావిధానం అమలు దిశగా 2021-22 బడ్జెట్‌లో రూ.93,224 కోట్లు కేటాయించారు. ఇందులో పాఠశాల విద్యకు రూ.54,873 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రూ.6,800 కోట్లు, నవోదయా విద్యాలయాలకు రూ.3800 కోట్లు ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటులో ఉన్న ఇబ్బందులు అధిగమించేందుకు యూనిట్‌ వ్యయాన్ని 20 కోట్ల నుంచి 38 కోట్ల రూపాయలకు పెంచారు. పాఠశాల విద్యను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా దాదాపు 15వేలకుపైగా బడులను జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆర్థికమంత్రి వివరించారు.

ఇదీ చదవండి: 100 సైనిక స్కూళ్లు- 15వేల బడులకు కొత్త కళ

ఇప్పటివరకూ దేశంలో 30 సైనిక్‌ స్కూళ్లు.. రక్షణ శాఖ పరిధిలోని సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా... స్వచ్ఛంద సంస్థలు, ప్రేవేటు పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో మరో వంద సైనిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉన్నత విద్యాసంస్థల బలోపేతం సహా నియంత్రణ కోసం గతంలో ప్రకటించిన కమిషన్‌కు.. ఈ ఏడాది కార్యరూపునిస్తామని, ఇందుకు సంబంధించిన బిల్లును ఈసారి తీసుకొస్తామని మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌లో 40 కేంద్రీయ ఉన్నత విద్యా సంస్థలున్నాయని నిర్మల వివరించారు. దేశంలోని మరో 9 నగరాల్లో అలాంటి సంస్థలు... ఏర్పాటు చేస్తామన్నారు. లేహ్‌లో కేంద్రీయ వర్సిటీ నెలకొల్పుతామన్నారు. వివిధ దేశాల సహకారంతో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం జాతీయ అప్రెంటిషిప్‌ విధానంలో మార్పులు చేస్తామన్నారు. ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా పూర్తిచేసినవారికి శిక్షణ ఇచ్చేందుకు రూ. 3వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ సమాచారాన్ని అంతర్జాలంలో మరిన్ని భాషల్లో అందించేందుకు జాతీయ భాషా అనువాద మిషన్‌ను ప్రకటిస్తున్నట్టు విత్తమంత్రి తెలిపారు.

శాస్త్రసాంకేతికం

మానవసహిత ప్రయోగాన్ని డిసెంబర్‌లో చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. సముద్రగర్భంలో చేపట్టే..... ప్రాజెక్టులు, జీవ వైవిద్యంపై అధ్యయనానికి.... కొత్తగా డీప్‌ ఓషన్‌ మిషన్‌ను ప్రకటించారు. ఇందుకు ఐదేళ్లలో.. 4వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.

రక్షణ రంగం

సరిహద్దుల్లో ద్విముఖ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రక్షణ రంగ బడ్జెట్​ గణనీయంగా పెరగలేదు. గతేడాది ఈ రంగానికి రూ. 4.71లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. ప్రస్తుతం రూ. 4.78లక్షల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో పింఛను కేటాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తొలగిస్తే.. సైన్యానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ. 3.62లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కేటాయింపుల్లో రూ. 1.35లక్షల కోట్లను.. నూతన ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలిటరీ హార్డ్​వేర్లను కొనేందుకు ఇచ్చింది కేంద్రం.

ఇదీ చదవండి: పద్దు 2021: రక్షణ రంగానికి రూ. 4.78లక్షల కోట్లు

పర్యటకం

పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన పర్యటక, ఆతిథ్య రంగాల ఆశలపై నీళ్లు చల్లుతూ.. కేటాయింపుల్లో భారీ కోత విధించింది సర్కార్. గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం తగ్గించి.. 2020-21 బడ్డెట్​లో రూ.2,500 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ సంక్షోభంతో వచ్చిన భారీ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోన్న పర్యటక రంగానికి ఇది పెద్ద దెబ్బ.

ఇదీ చదవండి: బడ్జెట్​ 2021: పర్యటకానికి షాక్- 19% కోత

క్రీడలు

ఈసారి బడ్జెట్​లో క్రీడలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవు. గతేడాదితో పోల్చుకుంటే రూ.230.78కోట్లు(8.16శాతం) తక్కువ నిధులు కేటాయించారు నిర్మలా సీతారామన్. మొత్తంగా క్రీడల కోసం రూ.2,596.14 కోట్లను ప్రతిపాదించారు.

నిధులు ఇలా

కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్రం తన వ్యయాలను పెంచుకుంది. ఫలితంగా ద్రవ్యలోటు 9.5 చేరింది. ఈ నేపథ్యంలో బడ్జెట్​కు కావాల్సిన అదనపు ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకోనున్నట్లు కేంద్రం తెలిపింది. వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు, అగ్రి సెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.