ETV Bharat / business

రూ.లక్షా 70వేల కోట్లతో 'ప్రధాన్​ మంత్రి గరీబ్​ కల్యాణ్​ ప్యాకేజీ'

కరోనా నేపథ్యంలో పేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది.

author img

By

Published : Mar 26, 2020, 1:47 PM IST

FM announces Rs 1.70 lakh crore Pradhan Mantri Gareeb Kalyan scheme to help the needy
రూ.1.70 లక్షల కోట్లతో కేంద్రం ప్యాకేజీ

కరోనా నేపథ్యంలో ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. రూ.1.70 లక్షల కోట్లతో రూపొందిన ఈ ప్యాకేజీలో పేదలు, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాలవారిని ఆదుకునేలా పలు ఉద్దీపనలు ప్రకటించారు ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌. అలాగే డాక్టర్లు, ఆశా వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా తీసుకొచ్చింది ప్రభుత్వం.

కరోనా ప్యాకేజీలో ముఖ్యంశాలు..

  • పేదలు, కార్మికులను ఆదుకోవడంపై దృష్టి
  • లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైనవారిని ఆదుకునేలా ప్యాకేజీ
  • వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ
  • ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం
  • ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం
  • పేదవాళ్లలో ఒక్కరు కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం
  • ప్రధానమంత్రి గరీభ్‌ కల్యాణ్‌ అన్న యోజన
  • ఈ పథకం ద్వారా 80 కోట్లమంది పేదలకు సాయం
  • రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం పంపిణీ
  • బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం
  • ఇప్పటికే ఇస్తున్న 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు అందిస్తాం
  • కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం
  • రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్‌ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు
  • ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ
  • నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి
  • శానిటేషన్‌ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా
  • కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.