ETV Bharat / business

'బిగ్ సేవింగ్ డేస్​' పేరిట ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లు - స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు

స్మార్ట్​ఫోన్లు, గృహోపకరణాలపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బిగ్​ సేవింగ్ డేస్​ సేల్​ పేరుతో మే 2 నుంచి 7 మధ్య ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్​లో భారీ తగ్గింపు ధరకు లభించనున్న ఫోన్లు, ఇతర వస్తువుల వివరాలు మీ కోసం.

flipkart big saving day
ఫ్లిప్​కార్ట్ 'బిగ్ సేవింగ్ డే'
author img

By

Published : May 1, 2021, 2:25 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ సమ్మర్​ స్పెషల్​ 'బిగ్​ సేవింగ్​ డేస్​' ఆఫర్​ ప్రకటించింది. ఈ ఆఫర్​ మే 2న ప్రారంభమై 7న ముగియనుంది. ఫ్లిప్​కార్ట్ ప్లస్​ యూజర్లకు ఒక రోజు ముందుగానే (మే 1న) ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

స్మార్ట్​ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలపై ఈ సేల్​లో భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. ముఖ్యంగా యాపిల్, వివో, శాంసంగ్, షియోమీ ఆసుస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం వరకు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవనున్నట్లు తెలిపింది.

ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్​..

శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ 62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం కానుంది. ఎఫ్​ 41 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్) రూ.12,999కే లభించనుంది. పోకో ఎక్స్​3 (6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​)ని రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.

ఫ్లాగ్​షిప్​ మొబైళ్ల విషయానికొస్తే.. ఐఫోన్ 11 రూ.44,999, ఆసుస్​ రాగ్​ ఫోన్ 3 రూ.41,999కు, ఐకూ 3 రూ.24,990కి లభించనున్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ ధర రూ.26,999గా నిర్ణయించింది ఫ్లిప్​కార్ట్​.

ఈ ఆఫర్లన్నింటితో పాటు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డ్​ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐలకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ క్లారిటీ ఇచ్చింది.

ఇవీ చదవండి: హెచ్​డీ సెట్​-టాప్​ బాక్స్​లపై టాటా స్కై ఆఫర్ల మేళ!

జియో యూజర్లకు అదిరిపోయే 'ఐపీఎల్ ఆఫర్లు'

ఫ్లిప్​కార్ట్​లో స్మార్ట్​ఫోన్లపై 50% వరకు డిస్కౌంట్​!

పిల్లల కోసం అమెజాన్ ప్రత్యేక సేల్- బెస్ట్​ డీల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.