ETV Bharat / business

మార్చి 12 నుంచి ఫ్లిప్​కార్ట్​ బిగ్​బిలియన్​ డేస్.. వాటిపై భారీ డిస్కౌంట్! - 'బిగ్​బిలియన్​ డేస్' సేల్

Flipkart big billion days: మార్చి 12 నుంచి 'బిగ్​బిలియన్​ డేస్' సేల్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​. ఈ సేల్​లో మొబైల్​ ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్​లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.​

flipkart big billion days starting in march 12
మార్చి 12 నుంచి 'బిగ్​బిలియన్​ డేస్' సేల్
author img

By

Published : Mar 7, 2022, 11:32 PM IST

flipkart big billion days: ప్రముఖ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​ 'బిగ్​ బిలియన్​ డేస్'​ సేల్​ను ప్రకటించింది. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్​ మార్చి 12 (శనివారం) మొదలై మార్చి 16న ముగియనుంది. మొబైల్​ ఫోన్లు, స్మార్ట్ వాచ్​లు, ల్యాప్​టాప్స్​, కెమెరా, బ్లూటూత్​లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్​ వస్తువులపై రాయితీలు ,ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్​లో లెనోవో యోగా ట్యాబ్​, ఐపాడ్​ ఏయిర్, రియల్​మీ వాచ్​2లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు.​ కొన్ని వస్తువులపై ప్రత్యేకమైన సమయాల్లోనే ఆఫర్లు వర్తిస్తాయని సంస్థ తెలిపింది. ఎస్​బీఐ కార్డు వినియోగదారులకు కొనుగోళ్లపై ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ కల్పిస్తున్నారు. ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ సభ్యులకు ఈ ఆఫర్​ ముందుగానే ప్రారంభం అవుతుంది.

flipkart big billion days starting in march 12
మార్చి 12 నుంచి 'బిగ్​బిలియన్​ డేస్' సేల్

యాపిల్​, రియల్​మీ, పోకో, శామ్​సంగ్​తో పాటు వివిధ ఫోన్లపై రాయితీలను అందిస్తుంది. ఎస్​బీఐ అందించే 10శాతం ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​తో పాటు నో కాస్ట్​ ఈఎమ్​ఐ సదుపాయాన్ని కల్పిస్తుంది. సేల్​లో కల్పించే రాయితీలకు సంబంధించిన టీజర్​ను ఫ్లిప్​కార్ట్​ తన వెబ్​సైట్​లో పెట్టింది. కానీ కచ్చితమైన డిస్కౌంట్​ వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఈ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్​ వస్తువులపై 80 శాతం, స్మార్ట్​వాచ్​లపై 60 శాతం, ల్యాప్​టాప్​లపై 40 శాతం డిస్కౌంట్​ను అందిస్తుంది. వన్​ప్లస్​, రియల్​మీ సంస్థలకు చెందిన బ్లూటూత్​లపై 80 శాతం డిస్కౌంట్​ను కల్పిస్తుంది.

డెల్​, హెచ్​పీ, ఆసుస్​, లెనోవో సంస్థల ల్యాప్​టాప్​లు, డీఎస్​ఎల్ఆర్​ కెమెరాలు, సౌండ్​బార్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కీబోర్డ్​, మౌజ్​ వంటి కంప్యూటర్​ వస్తువులపై 50 శాతం, ట్యాబ్లెట్స్​పై 45 శాతం డిస్కౌంట్​ ఇవ్వనున్నారు. లెనోవో యోగా, ఎమ్​8 ట్యాబ్లెట్స్​, ఐపాడ్​ ఏయిర్​ , రియల్​మీ ప్యాడ్​లపై వచ్చే ఫ్లిప్​కార్ట్ సేల్​లో డిస్కౌంట్​ ప్రకటించనున్నారు. మెమోరీ కార్డులపై 60 శాతం, గేమింగ్​ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్​ ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో డేటా సెంటర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.