విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు. వీరందరూ ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచివెళ్లిన వారే. మనకు తెలిసింది ఈ ముగ్గురు మాత్రమే.
కానీ ఆర్థిక నేరాలతో పాటు వివిధ రకాల మోసాలకు పాల్పడి గత ఐదేళ్లలో ఎంత మంది దేశం విడిచి పరారయ్యారో తెలుసా? 28 మంది. వీరిలో 18 మందిని వెనక్కి తీసుకురాగలిగింది భారత్.
వివిధ దేశాలకు పారిపోయిన ఈ 18 మందిని తీసుకురావటంలో భారతదేశం దౌత్య పరంగా ఎంతో కృషి చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్లపై చర్యలకు 2018లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన జీ-20 సమావేశంలో 9 సూత్రాల అజెండాను ప్రతిపాదించింది భారత్. ఈ సూత్రాలే నేరాలకు పాల్పడి దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్న వారిపట్ల యమపాశాలయ్యాయి.
భారత ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది వీరినే:
9 సుత్రాల్లోని ముఖ్యాంశాలు:
- ఆర్థిక నేరాలు, అవినీతి, ఇతర నేరాలకు పాల్పడిన వారు సభ్య దేశాల్లో ఏదైనా దేశంలో తలదాచుకుంటే వారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.
- ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న వారి ఆస్తులు సభ్య దేశాల్లో ఉంటే వాటిని జప్తు చేయాలి.
- తమ దేశంలో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్ల పూర్తి సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకోవాలి.
- తమ దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్లపై సత్వర న్యాయ విచారణ చేపట్టి వారి దేశానికి వెంటనే అప్పగించేందుకు చర్యలు చేపట్టాలి.
- తమ దేశానికి వచ్చేవారు ఏదైనా ఆర్థిక నేరానికి పాల్పడి ఉంటే వారిని దేశంలోకి అనుమతించకూడదు.
- జీ-20 సభ్య దేశాల్లో ఐకరాజ్య సమితి చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి.
- నేరాల నివారణకు జీ-20 సభ్య దేశాలు ఒక వేదికను ఏర్పాటు చేయాలి. సభ్య దేశాల అధికారులకు నేర నియంత్రణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.