ETV Bharat / business

2.69కోట్ల విద్వేష పోస్టులు తొలగించిన ఫేస్​బుక్​

2020 డిసెంబర్​ త్రైమాసికంలో 2కోట్లకు పైగా విద్వేష సమాచారన్ని ఫేస్​బుక్​ నుంచి తొలగించినట్లు ఆ సంస్థ తెలిపింది. వాటి వీక్షణలను కూడా గణనీయంగా తగ్గించినట్లు పేర్కొంది.

Facebook
2కోట్లకు పైగా విద్వేష సమాచారాన్ని తొలగించిన ఫేస్​బుక్​!
author img

By

Published : Feb 13, 2021, 6:47 AM IST

డిసెంబర్​ త్రైమాసికంలో.. విద్వేషపూరిత సమాచారానికి చెందిన 2కోట్ల 69లక్షల పోస్టులను తొలగించినట్టు ఫేస్​బుక్​ ఇండియా వెల్లడించింది. విద్వేష సమాచారానికి సంబంధించిన వీక్షణలు కూడా భారీగా తగ్గించినట్టు పేర్కొంది. వీటికి అంతర్జాతీయంగా 10వేల వీక్షణలు వస్తుంటే.. దేశంలో ఆ సంఖ్య 7-8 మాత్రమే ఉంటోందని స్పష్టం చేసింది.

ఫేస్​బుక్​కు ప్రపంచవ్యాప్తంగా 184 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీరిలో భారతీయులే అధికం. అయితే గత కొంత కాలంగా విద్వేషపూరిత సమాచారం నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వాటిని తగ్గించినట్టు ఫేస్​బుక్​ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: ఖాతాల తొలగింపునకు తలొగ్గిన ట్విట్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.