ETV Bharat / business

కరోనాపై వదంతుల వ్యాప్తికి ఫేస్​బుక్​ అడ్డుకట్ట - WHO to combat coronavirus misinformation

కరోనాపై పుకార్లు వ్యాపించకుండా 'ఫేస్​బుక్' మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలను ఉచితంగా ప్రచారణ అందించనుంది. కరోనా సమాచారాన్ని ఎరగా వేసి వ్యాపారం చేసుకునే ప్రకటనలపై ఇప్పటికే ఫేస్​బుక్ నిషేధం విధించింది.

Facebook gives free ads to WHO to combat coronavirus misinformation
కరోనా వందంతుల వ్యాప్తికి ఫేస్​బుక్​ అడ్డుకట్ట
author img

By

Published : Mar 4, 2020, 5:52 PM IST

కరోనా వైరస్​పై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తోడ్పాటునందించనుంది. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు ఉచితంగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

"కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే ప్రకటనలను మేము ఉచితంగా ఇస్తాము. అన్ని రకాల మద్దతును ఇస్తున్నాము. ఎవరైనా కరోనా వైరస్‌ సమాచారం కోసం వెతికితే వారికి ఒక పాపప్‌ వస్తుంది. అది వారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్థానిక వైద్య అధికారుల సూచనలు ఉన్నచోటకి తీసుకెళుతుంది" -మార్క్​జుకర్​బర్గ్​, ఫేస్​బుక్​ సీఈఓ

ఫేస్​బుక్​లో కరోనాపై ఉన్న తప్పుడు సమచారాన్ని తొలగించనున్నట్లు జుకర్​బర్గ్ స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా వైరస్​ను ఎరగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇచ్చే ప్రకటనలపై ఫిబ్రవరిలోనే నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:క్రిప్టో కరెన్సీపై నిషేధం ఎత్తివేత... సుప్రీం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.