ETV Bharat / business

ITR: గ‌డువు పెరిగినా వ‌డ్డీ చెల్లించాల్సిందే - ఆదాయ పన్ను రిటర్నులపై వడ్డీ ఛార్జీలు

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పిస్తూ.. గతంలో ఆదాయ పన్ను రిటర్ను(ITR)ల గడువును పెంచింది. అయితే, జరిమానా వడ్డీ ఛార్జీలపై ఎలాంటి మినహాయింపు లేదని తాజాగా స్పష్టం చేసింది. వీటిని యథావిధిగా చెల్లించాలని తెలిపింది.

ITR
ITR: గ‌డువు పెరిగినా వ‌డ్డీ చెల్లించాల్సిందే
author img

By

Published : Jul 24, 2021, 2:06 PM IST

కొవిడ్-19 మ‌హ‌మ్మారి సంక్షోభం నేప‌థ్యంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు ప్ర‌భుత్వం కొంత ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆదాయ ప‌న్ను రిట‌ర్ను(ITR)ల గ‌డువును సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పెంచింది. అయితే గ‌డువు పెంచిన‌ప్ప‌టికీ అంత‌కుముందు ఉన్న‌ జరిమానా వ‌డ్డీ ఛార్జీల‌ను య‌థావిధిగా చెల్లించాలి. వాటిపై ఎలాంటి మిన‌హాయింపు లేద‌ని పేర్కొంది.

వడ్డీ ఇలా..

ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం సెక్ష‌న్ 234ఎ, సెక్ష‌న్ 234బి, సెక్ష‌న్ 234సి కింద ఆల‌స్య చెల్లింపుల‌కు గాను వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖ‌లులో ఆల‌స్యం చేస్తే సెక్ష‌న్ 234ఎ కింద వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఐటీఆర్ ఫైలింగ్ చివ‌రి తేది జులై 31, 2021 అనుకుంటే ఆగ‌స్ట్ 5 రోజు ఐటీఆర్ దాఖ‌లు చేస్తే, చెల్లించాల్సిన మొత్తం ప‌న్నుపై నెల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. అంటే ఇక్క‌డ ఒక నెల దాటి మ‌రో నెల‌లో ఐదు రోజులే అయిన‌ప్ప‌టికీ, దాన్ని మొత్తం నెల‌గా భావిస్తారు. అందుకే పూర్తిగా నెల‌రోజుల వ‌డ్డీ వ‌ర్తింప‌జేస్తారు. అయితే గ‌త సంవ‌త్స‌రం మాదిరిగా ప్ర‌భుత్వం ఈ వ‌డ్డీ విష‌యంలో కొంత మిన‌హాయింపు అందించింది. చెల్లించాల్సిన ప‌న్ను మొత్తం రూ.ల‌క్ష లోపు ఉంటే ఇది వ‌ర్తించ‌దు. ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉంటే వ‌ర్తిస్తుంది. అంటే వారికి ఇప్పుడు సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఆగ‌స్ట్, సెప్టెంబ‌ర్ నెల‌ల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ చెల్లించాలి.

సెక్ష‌న్ 234బి ప్రకారం..

సెక్ష‌న్ 234బి కింద వ‌డ్డీ ఎప్పుడు వ‌ర్తిస్తుందంటే.. ప‌న్ను చెల్లింపుదారుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించ‌క‌పోతే లేదా 90 శాతం క‌న్నా త‌క్కువ‌గా చెల్లిస్తే 1 శాతం చొప్పున వ‌డ్డీ ప‌డుతుంది. సెక్ష‌న్ 208 ప్ర‌కారం ఒక సంవ‌త్స‌రానికి ప‌న్ను రూ.10,000 లేదా అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ చేయ‌క‌పోతే సెక్ష‌న్ 234బి కింద నెల‌కు 1 శాతం చొప్పున వ‌డ్డీ ఉంటుంది. కాబ‌ట్టి ఐటీఆర్ దాఖ‌లు ఆల‌స్యమ‌వుతుంద‌నుకుంటే క‌నీసం ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌డం మంచిది.

ముంద‌స్తు ప‌న్ను చెల్లింపు, నిర్ణీత వాయిదాల్లో చెల్లించాల్సిన దానికంటే త‌క్కువ‌గా ఉంటే అప్పుడు సెక్ష‌న్ 234సి కింద వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. కాబ‌ట్టి ప‌న్ను చెల్లింపుదారుడు వ‌రుస‌గా జూన్‌, సెప్టెంబ‌ర్‌, డిసెంబ‌ర్, మార్చి నెల 15 నాటికి..15 శాతం, 45 శాతం, 75 శాతం, 100 శాతం చొప్పున వాయిదాల్లో చెల్లించాలి. ఒక‌వేళ ముంద‌స్తు ప‌న్ను చెల్లింపు త‌క్కువ‌గా ఉంటే ఆ నిర్థిష్ట త్రైమాసికంలో 3 శాతం చొప్పున వ‌డ్డీ వ‌సూలు చేస్తారు.

ఈ సంవత్సరం, పన్ను శాఖ కొత్త ఆదాయ పన్ను పోర్టల్‌ను ప్రారంభించింది. కానీ దీంతో ప‌న్ను చెల్లింపుదారులు కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ సెక్షన్ 234 ఎ కింద ఉపశమనం అందించాలని ప‌న్ను నిపుణులు అంటున్నారు.

ఇదీ చదవండి: 'భారత్‌లో వచ్చే ఏడాది వేతనాలు గణనీయ పెంపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.