ETV Bharat / business

సెమీ కండక్టర్ల రంగంలో భారత్​ ఎక్కడ? - china in semi conductors feild

'సెమీకండక్టర్ల' విభాగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మనదేశం కృషి చేయకపోతే 'చిప్‌'ల కొరత మాదిరి సవాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించడంతోనే చైనా సెమీకండక్టర్ల పరిశ్రమపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. దేశీయంగా టాటా గ్రూపు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

semi condutctor sector
'సెమీకండక్టర్ల' విభాగం
author img

By

Published : Aug 20, 2021, 5:50 AM IST

Updated : Aug 20, 2021, 6:56 AM IST

చిప్‌సెట్‌లపై పూర్తిగా, ఇతర ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు, వస్తువుల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశం మనది. ఏటా 40 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు, విడిభాగాలను మనదేశం దిగుమతి చేసుకుంటోంది. 'సెమీకండక్టర్ల' విభాగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మనదేశం కృషి చేయకపోతే 'చిప్‌'ల కొరత మాదిరి సవాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించడంతోనే చైనా సెమీకండక్టర్ల పరిశ్రమపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల మేరకు సబ్సిడీలు ఇస్తోంది. చిప్‌సెట్లు అత్యధికంగా తయారు చేసే తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్‌లలోని సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించాయి.

భారీ పెట్టుబడులు కావాలి

సెమీకండక్టర్ల పరిశ్రమల స్థాపన ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రైవేటు రంగం ఒక్కటే అంత భారీ పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు. అందువల్ల ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత నెమ్మదిగా పరిశ్రమ విస్తరించే అవకాశం ఉంటుంది. సెమీకండక్టర్ల విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన టీఎస్‌ఎంసీ(తైవాన్‌ సెమీకండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ) వంటి సంస్థలను ఆహ్వానించి, వాటి భాగస్వామ్యంతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని నిపుణులు సూచిస్తున్నారు. మనదేశ ఐటీ రంగంలో 2.5 లక్షల మందికి పైగా చిప్‌ డిజైనర్లు, టెస్టర్లు ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా 300 కంటే అధిక కంపెనీలు చిప్‌ డిజైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌.. తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి. అందువల్ల ఈ రంగంలో మనదేశమూ త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని గుర్తించినందునే టాటా గ్రూపు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సెమీకండక్టర్‌ పరిశ్రమకు సంబంధించిన కీలక విడిభాగాలు ఉత్పత్తి చేసే పరిశ్రమ స్థాపించే ఆలోచన ఉన్నట్లు గత వారంలో టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

'చిప్‌' తయారీ సంస్థలు ఏం చేస్తున్నాయి?

  • ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్‌, స్మార్ట్‌ఫోన్‌ విక్రయ సంస్థ అయిన శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ అమెరికాలో 17 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఫౌండ్రీ ఫ్యాబ్‌ నెలకొల్పే యోచనలో ఉంది.
  • కాంట్రాక్టు పద్ధతిలో చిప్‌లు తయారు చేసే, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ అయిన తైవాన్‌ సెమీకండక్టర్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ) వచ్చే మూడేళ్లలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోడానికి 100 బి.డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. జర్మనీ, జపాన్‌లలో చిప్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయొచ్చు.
  • సెమీకండక్టర్ల విభాగంలో అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్‌ అమెరికాలో చిప్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోడానికి 20 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఫౌండ్రీ వ్యాపారంలోకి మళ్లీ అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది.

పూర్తి మద్దతు ఇస్తాం: పీయూశ్‌ గోయల్‌

దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ చెప్పారు. 'ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్లకు తీవ్ర కొరత ఉంది. ఈ పరిశ్రమను మనదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' అన్నారాయన.

సెల్‌ఫోన్లకూ సమస్యే

కేవలం దేశీయ కార్ల పరిశ్రమనే కాకుండా 'చిప్‌'ల కొరత, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు ఉత్పత్తి చేసే కంపెనీలను సైతం ఇబ్బందుకులకు గురి చేస్తోంది. సెల్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ పీసీలు, ల్యాప్‌ట్యాప్‌ల నుంచి 'లాజిక్‌'తో పనిచేసే వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి గృహోపకరణాల తయారీ సంస్థలకు సైతం 'చిప్‌' సెగ తగులుతోంది. దీంతో కొన్ని సెల్‌ఫోన్‌ కంపెనీలు హైఎండ్‌ ఫోన్ల ఉత్పత్తికే పరిమితం అవుతూ, తక్కువ ధరకు విక్రయించే 'ఎంట్రీ లెవల్‌' ఫోన్ల ఉత్పత్తి తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచటం గమనార్హం. 'చిప్‌'ల కొరతతో రూ.10,000లోపు స్మార్ట్‌ఫోన్ల సరఫరా తగ్గినట్లు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల రిటైలింగ్‌ సంస్థ బి న్యూ సీఎండీ బాలాజీ తెలిపారు. ల్యాప్‌టాప్‌ల ధరలను దాదాపు ప్రతి 15 రోజులకు ఒకసారి కంపెనీలు పెంచుతున్నాయని హైదరాబాద్‌లోని ఐటీ మాల్‌ ఎండీ అహ్మద్‌ తెలిపారు. మొత్తం మీద చూస్తే 'చిప్‌' ల కొరత అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల మీద ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

మన మార్కెట్లు పని చేయలేదు

మొహర్రం సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయలేదు. ఫారెక్స్‌, మనీ సహా ఇతర ప్రధాన మార్కెట్లకు కూడా సెలవే.

ఇదీ చూడండి: క్రెడిట్​ స్కోరు లేకున్నా లోన్​ గ్యారెంటీ- ఎలాగంటే...

Last Updated : Aug 20, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.