ETV Bharat / business

''స్పుత్నిక్​-వి'పై అదనపు సమాచారం ఇవ్వండి'

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వి'పై అదనపు సమాచారం ఇవ్వాలని కేంద్ర ఔషధ ప్రాధికార సంస్థ.. డాక్టర్​ రెడ్డీస్​ను కోరింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి ముందు సంబంధిత డేటాను సమర్పించాలంది.

Expert panel seeks additional data from Dr Reddy's Laboratories on Russian COVID vaccine Sputnik V
స్పుత్నిక్​-విపై అదనపు సమాచారమివ్వండి
author img

By

Published : Apr 2, 2021, 7:56 AM IST

రష్యాకు చెందిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వి'పై అత్యవసర వినియోగ అనుమతికి ముందు మరింత అదనపు సమాచారం ఇవ్వాలని కోరుతూ.. కేంద్ర ఔషధ ప్రాధికార సంస్థలోని నిపుణుల కమిటీ.. డాక్టర్​ రెడ్డీస్​ను కోరింది. తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కొవిడ్​-19పై కేంద్ర ఔషధ ప్రమాణాల సంస్థ(సీడీఎస్​సీఓ) నియమించిన విషయ నిపుణుల కమిటీ(ఎస్​ఈసీ)కి గత ఫిబ్రవరి 24న డాక్టర్​ రెడ్డీస్​.. దేశంలో ఉత్పత్తి చేసిన గామ్​-కొవిడ్​-వ్యాక్సిన్​ కంబైన్డ్​ వెక్టార్​ వ్యాక్సిన్​ తాత్కాలిక భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను కొనసాగుతున్న రష్యన్ అధ్యయనం నుంచి తాత్కాలిక డేటాతో పాటు సమర్పించింది. గురువారం సమావేశమైన ఎస్​ఈసీ అత్యవసర వినియోగ అనుమతి దరఖాస్తుపై చర్చించింది. సంస్థ అన్ని ఇమ్యునోజెనిసిటీ పరామితులకు సంబంధించిన డేటాను, తీవ్రమైన ప్రతికూల సంఘటనల డేటాను, ఆర్​టీ-పీసీఆర్​ పాజిటివ్​ కేసులకు సంబంధించిన డేటాను సమర్పించాలని సిఫార్సు చేసింది. భారతీయ, రష్యన్​ అధ్యయనాలపై వివిధ సమయాల్లో మూడో దశ ఇమ్యునోజెనిసిటీ డేటాను తులనాత్మక విశ్లేషణతో అందించాలని కోరింది.

ఇదీ చదవండి: 'టీకా అసమానతల'పై డబ్ల్యూటీఓ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.