కరోనా పై పోరాటం చేస్తున్న భారత్‌కు మద్దతుగా నిలిచారు విటలిక్ బుటేరియన్. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఎథేరియం కాయిన్లను ఇండియా కొవిడ్ క్రిప్టోరిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. 500 ఎథేరియం కాయిన్లతో పాటు 50 ట్రిలియన్ షిబ్ కాయిన్లను కూడా దానం చేశారు. వీటి మొత్తం విలువ సుమారు 1.14 బిలియన్ డాలర్లు.
అయితే విటలిక్ ఈ ప్రకటన చేసిన వెంటనే షిబ్ కాయిన్ విలువు అమాంతగా 35శాతానికి పైగా పడిపోయింది. దీనిపై ఇండియా కొవిడ్ క్రిప్టో రిలిఫ్ ఫండ్ ప్రతినిధి సందీప్ నైల్వాల్ స్పందించారు. షిబ్ కాయిన్‌కు సంబంధించిన రిటైల్ పెట్టుబడిదారులు కంగారు పడాల్సింది ఏం లేదని తెలిపారు.
ఇటీవల కాలంలో షిబ్ కాయిన్ బిలియన్ డాలర్ల మేరకు పెట్టబడులను రాబట్టిందని అమెరికాకు చెందిన వార్తా సంస్థ టెక్ క్రంచ్ చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి: క్రిప్టో సంబంధాలపై పునరాలోచన!