బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని కేసులో డెక్కన్ క్రానికల్ సంస్థకు చెందిన రూ.122.01 కోట్ల స్థిరాస్తిని ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకు రూ.264.56 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. రుణాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ విచారణ జరుపుతోంది.
సంస్థ ప్రమోటర్లు డీసీహెచ్‌ఎల్ పేరుతో నకిలీ కంపెనీలు సృష్టించారని ఆరోపణలతో పాటు అక్రమంగా నగదు బదలాయించారని 2015లో డీసీపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం