ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం కోల్పోయిన మస్క్! - బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఎవరు

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ సంపద భారీగా తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన సంపద 9.1 బిలియన్ డాలర్లు ఆవిరైంది. దీనితో ప్రపంచ కుబేరుల్లో ఆయన రెండో స్థానాన్ని కూడా కోల్పోయారు.

Tesla CEO Elon Musk
టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్
author img

By

Published : May 18, 2021, 1:06 PM IST

గత ఏడాది అనూహ్య రీతిలో సంపదను పెంచుకుని ప్రపంచ కుబేరుల్లో ఏకంగా అగ్ర కిరీటాన్ని అందుకున్న టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్.. మార్చిలో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అయితే టెస్లా షేర్లు తాజాగా 2.2 శాతం క్షీణించడం వల్ల ఆయన రెండో స్థానాన్ని కూడా కోల్పోయారు.

ఓ నివేదిక ప్రకారం మస్క్ సంపద ప్రస్తుతం 160.6 బిలియన్​ డాలర్లు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9.1 బిలియన్​ డాలర్ల సంపదను కోల్పోయారు మస్క్.

ఫ్రాన్స్​కు చెందిన లగ్జరీ గూడ్స్ సంస్థ 'ఎల్​వీఎంహెచ్' అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 161.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద ఈ ఏడాది 47 బిలియన్ డాలర్లు పెరగటం విశేషం.

అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

మస్క్ సంపద తగ్గుదలకు కారణాలు..

చైనాలో టెస్లా ఎదుర్కొంటున్న ఇబ్బందులు షేర్ల విలువ తగ్గేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

బిట్​కాయిన్ విలువ ఇటీవల రికార్డు స్థాయిలో తగ్గటం కూడా మస్క్ సంపద క్షీణతకు కారణం. ఎందుకంటే బిట్​కాయిన్​లో మస్క్ ఈ ఏడాది ఆరంభంలో భారీ పెట్టుబడులు పెట్టారు.

ఇది చదవండి:త్వరలో భారత్​లో అడుగుపెట్టనున్న 'క్లబ్​హౌస్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.