ETV Bharat / business

వస్తువులపై వారంటీని పొడిగించిన సంస్థలు - కరోనా బిజినెస్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులపై వారెంటీని పొడిగించాయి. శాంసంగ్, వన్​ప్లస్, ఓపో, రియల్​మి సహా పలు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

Electronics, phone makers extend warranties for customers amid COVID-19 lockdown
ఎలక్ట్రానిక్స్‌, మొబైల్స్‌ వారెంటీ పొడిగింపు
author img

By

Published : Apr 2, 2020, 6:33 AM IST

కరోనా నేపథ్యంలో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వారెంటీని పొడిగించాయి. తమ సంస్థ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ముగిసే వారెంటీ గడువును మే 31 వరకు పొడిగించింది శామ్‌సంగ్‌. రియల్‌మి సంస్థ సైతం ఉత్పత్తులపై వారెంటీని పొడిగించింది. వారెంటీని మే 31 వరకు పొడిగించడంతో పాటు, మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య కొనుగోలు చేసిన వారికి రీప్లేస్‌మెంట్‌ గడువును కూడా 30 రోజులు అదనంగా ఇచ్చింది.

వన్‌ప్లస్‌, ఓపో సంస్థలు మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉన్న వారెంటీ గడువును మే 31 వరకు విస్తరించాయి. ఫోన్లు, టీవీలకు వారెంటీని మరో 60 రోజులు పొడిగిస్తూ డెటెల్‌ సంస్థ నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులపై మార్చి 15నుంచి మే 15 మధ్య ముగిసే వారెంటీని 60 రోజులు పొడిగిస్తున్నట్లు లావా తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.