ETV Bharat / business

'రూ.12.5 లక్షల కోట్ల పెట్టుబడి కావాలి' - ఛార్జింగ్​ స్టేషన్లు

భారతీయ విద్యుత్​ వాహన(ఈవీ) విపణి 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే రూ. 12.5 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ ఫైనాన్స్‌ (సీఈఈడబ్ల్యూ-సీఈఎఫ్‌) అంచనా వేసింది. పెట్టుబడులు చేకూరితే వచ్చే పదేళ్లలో భారత విద్యుత్‌ వాహన విపణి దాదాపు 14 లక్షల 42వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది.

electronic vehicles 2030 goals in india
'రూ.12.5 లక్షల కోట్ల పెట్టుబడి కావాలి'
author img

By

Published : Dec 9, 2020, 10:33 AM IST

భారతీయ విద్యుత్‌ వాహన (ఈవీ) విపణి 2030 నాటికి ఆశించిన లక్ష్యాలు చేరుకోగలిగితే, రూ.14.42 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధిస్తుందని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌-సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ ఫైనాన్స్‌ (సీఈఈడబ్ల్యూ-సీఈఎఫ్‌) అధ్యయనం వెల్లడించింది. అయితే ఇదే సమయంలో ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే రూ.12.5 లక్షల కోట్ల సంచిత పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. కాగా, 2020 మార్చి ఆఖరుకు దేశంలో కేవలం 5 లక్షల విద్యుత్‌ వాహనాలు మాత్రమే రిజిస్టర్‌ అయినట్లు తెలిపింది. 2030 మార్చి చివరకు అన్ని వాహన విభాగాల్లో కలిపి ఈ సంఖ్య 10 కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. దీని కోసం ఏడాదికి సుమారు 158 గిగావాట్స్‌అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యం గల బ్యాటరీలు ఉత్పత్తి చేయాల్సి రావొచ్చని, ఇది దేశీయ తయారీదారులకు మంచి అవకాశమని పేర్కొంది. నీతి ఆయోగ్‌ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం, 2030 నాటికి ఆయా రాష్ట్రాలు 70% వాణిజ్య కార్లు, 30% ప్రైవేటు కార్లు, 40% బస్సులు, 80% ద్వి, త్రిచక్ర వాహనాలు కలిగి ఉంటాయని సీఈఈడబ్ల్యూ-సీఈఎఫ్‌ అంచనా వేసింది.

వచ్చే పదేళ్లలో భారత విద్యుత్‌ వాహన విపణి సుమారు 206 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.14,42,000 కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. వాహనాల ఉత్పత్తి, ఛార్జింగ్‌ మౌలిక వసతుల కోసం భారత్‌కు 180 బి.డాలర్లు (సుమారు రూ.12,50,000 కోట్ల సంచిత పెట్టుబడులు) అవసరమవుతాయని అంచనా వేసింది.

ఇదీ చదవండి : వాయు కాలుష్యానికి మందు విద్యుత్‌ వాహనాలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.