ఎన్నికల ముందు పెట్టుబడిదారుల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలూ కలిసొచ్చాయి. చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 346 పాయింట్ల లాభంతో 37,400 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో 11,254 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్నవివే:
పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, ఎల్ & టీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్సీఎల్, వేదాంత.
నష్టాల్లోనివి ఇవే:
భారతీ ఎయిర్టెల్, ఇండస్ లాండ్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
లాభాలకు కారణాలివే:
⦁ విదేశీ పెట్టుబడుల ప్రవాహం
⦁ ఆసియా మార్కెట్ల లాభాల పరుగు
⦁ ఎన్నికల ముందు ఉండే కొనుగోళ్ల సెంటిమెంట్
⦁ అంతర్జాతీయ సానుకూలత