శరీరంలోని యాంటీబాడీలను నిర్ధరణ చేసుకునేందుకు ఉపకరించే కిట్‌ను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) రూపొందించింది. కరోనా యాంటీబాడీ డిటెక్షన్ 'డిప్కోవాన్'గా పిలిచే ఈ కిట్.. 97శాతం కచ్చితత్వంతో, 99శాతం కరోనా వైరస్ ప్రోటీన్లను గుర్తించగలదని డీఆర్డీఓ పేర్కొంది.
ఈ కిట్ జీవితకాలం 18 నెలలని , కేవలం 75నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది డీఆర్డీఓ.
దిల్లీకి చెందిన వాన్‌గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ కిట్ ఉత్పత్తిని జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఒక్కో కిట్ ధర సుమారు రూ.75 ఉండొచ్చని అంచనా.
అనుమతులు..
తాము రూపొందించిన కిట్ తయారీ, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చినట్లు డీఆర్డీఓ తెలిపింది. అలాగే.. ఏప్రిల్‌లోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం లభించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది డీఆర్డీఓ.
ఇవీ చదవండి: జూన్ 1న మార్కెట్లోకి కోటి 'కొవిసెల్ఫ్' టెస్ట్ కిట్లు!