స్పుత్నిక్ వి టీకా ధరపై డాక్టర్ రెడ్డీస్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూపొందించిన ఈ టీకా ఒక్క డోసు ధర 995.40 రూపాయలని వెల్లడించింది. స్థానికంగా పంపిణీ ప్రారంభం అయ్యాక టీకా ధర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
వ్యాక్సిన్‌కు సంబంధించి మరిన్ని డోసులు త్వరలో దిగుమతి కానున్నాయని పేర్కొంది. భారత్‌లో ఉత్పత్తి, పంపిణీకి ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.