ETV Bharat / business

డిసెంబర్​లో దూసుకుపోయిన దేశీయ వాహనాల అమ్మకాలు

డిసెంబర్​ నెల.. దేశీయ వాహనాలకు కలిసొచ్చింది. అమ్మకాలలో సరికొత్త రికార్డు నెలకొంది. ముఖ్యంగా మారుతీ, టాటా మోటార్స్​ అమ్మకాల్లో 20 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. వీటితో పాటు ద్విచక్ర వాహన విక్రయాల్లోనూ పెరుగుదల కనిపించింది.

Domestic vehicle rush in December
డి'సంబరం' లో దేశీయ వాహనాలు.. 20 శాతం పైగా వృద్ధి..
author img

By

Published : Jan 2, 2021, 6:44 AM IST

Updated : Jan 2, 2021, 6:57 AM IST

పండగ సీజను అనంతరమూ వాహన విక్రయాల్లో వృద్ధి కొనసాగింది. డిసెంబరులో ప్రోత్సాహకర రీతిలో అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశీయ వాహన దిగ్గజాలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ 20 శాతానికిపైగా వృద్ధితో ఆకట్టుకున్నాయి. మారుతీ మొత్తం అమ్మకాల్లో 20.2 శాతం, దేశీయ అమ్మకాల్లో 17.8 శాతం వృద్ధి లభించిది. ఈ సంస్థ మినీ కార్ల విభాగంలో 2019 డిసెంబరులో 23,883 అమ్మకాలు నమోదుకాగా.. కిందటి నెలలో 4.4 శాతం పెరిగి 24,927 వాహనాలకు చేరాయి.

Domestic vehicle rush in December
డిసెంబర్​లో దేశీయ వాహనాల విక్రయాలు

స్విప్ట్‌, బాలెనో, డిజైర్‌ లాంటి మోడళ్లతో కూడిన కాంపాక్ట్‌ కార్ల విభాగ అమ్మకాలు 18.2 శాతం వృద్ధితో 77,641 వాహనాలుగా నమోదయ్యాయి. 2019 డిసెంబరులో ఈ తరహా కార్లను 65,673 వరకు మారుతీ విక్రయించింది. మధ్య తరహా సెడాన్‌ సియాజ్‌ అమ్మకాలు 28.9 శాతం క్షీణించి 1,270 వాహనాలకు పరిమితమయ్యాయి. విటారా బ్రెజా, ఎస్‌క్రాస్‌, ఎర్టిగా మోడళ్లతో కూడిన యుటిలిటీ వెహికల్స్‌ విభాగం అమ్మకాలు 8 శాతం పెరిగి 25,701 వాహనాలుగా నమోదయ్యాయి.

టాటా మోటార్స్‌ విక్రయాలు 44,254 నుంచి 21 శాతం పెరిగి 53,430కి చేరాయి. ప్రయాణికుల వాహన విభాగం అమ్మకాలు 12,785 నుంచి 84 శాతం వృద్ధితో 23,545కు చేరాయి. అయితే వాణిజ్య వాహన విక్రయాలు 34,082 నుంచి 32,869కి తగ్గాయి. హ్యుందాయ్‌ మోటార్‌, టయోటా కిర్లోస్కర్‌, ఎంజీ మోటార్‌లు కూడా అమ్మకాలపరంగా మెరుగైన ప్రదర్శననే కనబర్చాయి.

మహీంద్రా అండ్‌ మహీంద్రా మాత్రమే గత నెలలో అమ్మకాల క్షీణతను మూటకట్టుకున్నాయి. ద్విచక్రవాహనాల కంపెనీలు కూడా రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి.

ఇదీ చదవండి: కరోనాను అరికట్టేందుకు 'కొవిషీల్డ్​'కు గ్రీన్​ సిగ్నల్​!

Last Updated : Jan 2, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.