ETV Bharat / business

జనవరిలోనూ 'ఆటో' రివర్స్​ గేర్​- సేల్స్​ 6.2% డౌన్ - ద్విచక్రవాహనాలు

ఆర్థిక మందగమనానికి తోడు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జనవరిలో 6.2 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. అయితే ఆటోఎక్స్​పో 2020 విజయవంతం కావడం, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వాహన రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Domestic passenger vehicle sales drop 6.2 pc in January
జనవరిలోనూ 'ఆటో' రివర్స్​ గేర్​- సేల్స్​ 6.2% డౌన్
author img

By

Published : Feb 10, 2020, 12:58 PM IST

Updated : Feb 29, 2020, 8:44 PM IST

జనవరిలో దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం తగ్గాయని వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. వృద్ధి మందగమనం, యాజమాన్య వ్యయం పెరగడానికి తోడు డిమాండ్ తగ్గడమూ ఇందుకు కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు.

తగ్గిన అమ్మకాలు

సియామ్ గణాంకాల ప్రకారం.... 2019 డిసెంబర్​లో అమ్ముడైన పాసింజర్ వాహనాల సంఖ్య 2,80,091కాగా, 2020 జనవరిలో ఈ వాహన అమ్మకాలు 2,61,714 యూనిట్లకు పడిపోయాయి.

అన్ని రకాల వాహనాల అమ్మకాలు తీసుకుంటే... 2019 జనవరిలో 20,19,253 యూనిట్లు అమ్ముడుపోగా, 2020 జనవరి నాటికి 13.83 శాతం క్షీణించి 17,39,975కు పడిపోయాయి.

వాహనరకం 2020- జనవరి​ 2019 జనవరి క్షీణత
కార్లు 1,64,793 1,79,324 8.1 శాతం
ద్విచక్రవాహనాలు 13,41,005 15,97,528 16.06 శాతం
మోటార్ సైకిళ్లు 8,71,886 10,27,766 15.17 శాతం
స్కూటర్లు 4,16,594 4,97,169 16.21 శాతం
వాణిజ్య వాహనాలు 75,289 87,591 14.04 శాతం

ఖర్చులు పెరగడమే కారణం!

ఏప్రిల్ 1 నుంచి బీఎస్​-IV నుంచి బీఎస్​-VI వాహనాల వైపు మారడానికి తయారీదారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటూ పలు కంపెనీలు వాటి వాహనాల ధరలను పెంచాయి.

ఆశలున్నాయ్!

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనలు... వాహన అమ్మకాలు వృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశిస్తున్నట్లు సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాలు పుంజుకుంటాని ఆశాభావం వ్యక్తం చేశారు.

సియామ్ డైరెక్టర్ రాజేష్​ మీనన్​ ప్రకారం... త్రీ-వీలర్లు మినహాయించి, మిగతా వాహనాల అమ్మకాలు బాగా క్షీణించాయి. పండగ సీజన్​లోనూ వాహనాల అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. అయితే ఆటో ఎక్స్​పో 2020కి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇప్పటికే 70 నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు జరగడం... వాహన రంగం పుంజుకోవడానికి దోహదం చేస్తాయన్నారు.

మారుతీ సుజుకి భళా

జనవరిలో, ప్యాసింజర్ వాహనాల విభాగంలో... మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు 0.29 శాతం పెరిగాయి. మొత్తం 1,33,844 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు మాత్రం 8.3శాతం క్షీణించాయి. 42,002 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17.05 శాతం క్షీణించి 19,794కు పడిపోయాయి.

టూ-వీలర్స్​

ద్విచక్ర వాహన విభాగంలో మార్కెట్​ లీడర్ హీరో మోటోకార్ప్ అమ్మకాలు 14.37 శాతం తగ్గి 4,88,069 యూనిట్లే అమ్ముడుపోయాయి. హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా అమ్మకాలు కూడా 6.63 శాతం క్షీణించి 3,74,114 యూనిట్లకు పరిమితమయ్యాయి.

చైన్నైకు చెందిన టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు జనవరిలో 28.72 శాతం క్షీణించాయి. 1,63,007 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

ఇదీ చూడండి: చైనాకు 'కరోనా' కష్టాలు- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం

Last Updated : Feb 29, 2020, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.