ETV Bharat / business

ఎల్‌ఐసీ ఐపీఓ మదుపర్లను మెప్పిస్తుందా..?

ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.10-12 లక్షల కోట్లు ఉండొచ్చు. దేశంలోనే అతిపెద్ద నమోదిత కంపెనీగా అవతరించే అవకాశమూ ఉండొచ్చు. రూ.3 లక్షలకు పైగా ఆస్తులను అది నిర్వహిస్తూ ఉండొచ్చు. 11 లక్షల ఏజెంట్లు పనిచేస్తూ ఉండొచ్చు. అన్నిటికంటే మించి వచ్చే 14 నెలల్లో ఐపీఓకు వచ్చి మంచి ఆదరణ కూడా పొందొచ్చు. అయితే ఒక విషయంలో మాత్రం అది వెనకడుగు వేసే అవకాశం ఉందని మదుపర్లు అంచనా వేస్తున్నారు. అదేమిటి?

Does LIC IPO attract investors?
ఎల్‌ఐసీ ఐపీఓ
author img

By

Published : Feb 9, 2020, 11:49 AM IST

Updated : Feb 29, 2020, 5:43 PM IST

బీమా సంస్థ జవాబుదారీతనం మెరుగుపరచాలని, పాలసీదారులకు మరింత నమ్మకం కలిగించాలనే ఎల్‌ఐసీ వాటాలను విక్రయించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అయితే ఎంత శాతం వాటాను విక్రయించాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శనివారం చెన్నైలో జరిగిన 'జన్‌ జన్‌ కా బడ్జెట్' కార్యక్రమంలో ఆమెపై విషయాలు వెల్లడించారు. వాటాల విక్రయంతో ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఎలాంటి నష్టం, ఇబ్బందులు తలెత్తవని సంస్థ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు. కాగా. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా ఎల్‌ఐసీలో ప్రభుత్వం తన మైనారిటీ వాటాను విక్రయించే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి ఇప్పటికే వెల్లడించారు.

వెలిగిపోతున్న దీపం

రెండు చేతులు మధ్యలో వెలిగిపోతున్న దీపం గుర్తుతో మొదలైన ఎల్‌ఐసీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. పైన చెప్పిన గణాంకాలే అందుకు నిదర్శనం. అవే కాదు.. మొత్తం బీమా రంగంలోనే కొత్త ప్రీమియం వ్యాపారంలో నాలుగింట మూడో వంతు దీనిదే. అవును మరి ఎవరిని అడిగినా కచ్చితంగా ఎల్‌ఐసీ బీమాను కలిగి ఉంటారు. ఆ తర్వాతే మిగతా సంస్థల బీమా సంగతి. అందుకే కదా ఇతర ప్రభుత్వ రంగ కంపెనీలు మార్కెట్లో పోటీపరంగా హెచ్చుతగ్గులకు గురైనా ఎల్‌ఐసీ మాత్రం బలంగా కొనసాగుతోంది. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మూడో స్థానంలో ఉన్నట్లు టీఆర్‌ఏ రీసెర్చ్‌ సర్వే-2019 చెబుతోంది. అంతే కాదు.. భారత్‌లోనే అతిపెద్ద సంస్థల్లో ఎల్‌ఐసీ ఒకటి.

ఇదంతా బాగానే ఉంది. మరి ఈక్విటీ మదుపర్లు ఎల్‌ఐసీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?

ఆ మూడు అంశాల్లో

మిగతా బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ ఎవరికీ అందనంత దూరంలో ఉండొచ్చు. అయితే స్థిరమైన వృద్ధి, బలమైన కార్పొరేట్‌ పాలన, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లతో పోలిస్తే వెనకబడి ఉంది.

వార్షిక ప్రీమియం వృద్ధి

వార్షిక ప్రీమియం వృద్ధి విషయాల్లో ప్రైవేటు జీవిత బీమా కంపెనీలు ముందున్నాయి. ఈ వృద్ధితోనే ఒక కంపెనీ ఎంత వేగంగా కొత్త రిటైల్‌ వినియోగదార్లను జత చేసుకుంటున్నది ఆధారపడి ఉంటుంది. గత అయిదేళ్లలో చూస్తే ఎల్‌ఐసీ వ్యక్తిగత వార్షిక ప్రీమియం వృద్ధి.. మిగతా ప్రైవేటు జీవిత బీమా కంపెనీలతో పోలిస్తే తక్కువే ఉంది. ఏప్రిల్‌-డిసెంబరులో ఎల్‌ఐసీ వార్షిక ప్రీమియం వృద్ధి 14 శాతంగా ఉండగా.. ప్రైవేటు కంపెనీల విషయంలో ఇది 19 శాతంగా ఉంది. మార్చి 2016లో ఈ విషయంలో ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 77 శాతంగా ఉండగా.. ఇపుడు అది 52 శాతానికి పరిమితమైంది.

టర్మ్‌ పాలసీల ఆదాయం

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పథకాల వంటి రక్షణాత్మక పథకాల నుంచి వచ్చే ఆదాయం విషయంలోనూ ఎల్‌ఐసీ వెనకబడుతోంది. 2011-12లో ఈ రక్షణాత్మక వ్యాపారంలో ఈ సంస్థ వాటా 62 శాతంగా ఉండగా.. 2017-18(ఏప్రిల్‌-మార్చి) నాటికి అది 35.1 శాతంగా నమోదైందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ తెలిపింది.

దీర్ఘకాలిక స్థానం

కొత్త తరం యువతీయువకులు మరింత మెరుగైన ప్రతిఫలాలు, తక్కువ ధరలతో ఉన్న ఉత్పత్తులను అందిస్తున్న ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎల్‌ఐసీదే అగ్రస్థానం అయినప్పటికీ.. దీర్ఘకాలంలో ఆ స్థానం పదిలంగా ఉంటుందా అన్నది ప్రశ్నగా మారుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా జీవిత బీమా వ్యాపారంలో ఎల్‌ఐసీ తన ప్రభను కోల్పోవచ్చని ఓ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌ అంటున్నారు.

కార్పొరేట్‌ పాలన

ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు మార్కెటింగ్‌ కంపెనీలతో పోలిస్తే కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. మరో పక్క, ఏ ప్రభుత్వ రంగ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినా.. ప్రభుత్వం దానిని బయటపడేయడానికి ఎల్‌ఐసీ వైపే చూస్తూ వస్తోంది. ఇలా ప్రభుత్వ జోక్యం కనిపిస్తుండడం, మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు ఇవ్వడంపై మదుపర్లు సానుకూలంగా లేరు. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్‌ఐసీతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించడంతో దాని పెట్టుబడుల విలువ తగ్గుతోంది. ఉదాహరణకు న్యూ ఇండియా అసూరెన్స్‌లో 8.67% వాటాను ఒక్కో షేరును రూ.800తో కొనిపించారు. ఇపుడు అది అయిదో వంతు ధరతో ట్రేడవుతోంది.

ఈ ప్రతికూల అంశాలన్నీ కూడా ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారిపై ప్రభావం చూపవచ్చు. ఎల్‌ఐసీకున్న బ్రాండ్‌ విలువ వల్ల ఐపీఓకు మంచి స్పందన వచ్చినా.. ధరపై ప్రీమియం ఎంత మేర దూసుకెళుతుందన్నది పై అంశాలను మదుపర్లు ఎలా తీసుకుంటారన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చూడండి: పనిచేస్తున్న సంస్థకు పాన్​కార్డ్​ వివరాలు ఇచ్చారా?

Intro:Body:

'Missing' posters of Akhilesh Yadav put up in Azamgarh

 (09:36) 

Azamgarh (Uttar Pradesh), Feb 9 (IANS) Samajwadi Party president and MP from Azamgarh, Akhilesh Yadav is the latest politician to face the ire of his voters for prolonged absence from his constituency.

'Missing' posters of Akhilesh Yadav have surfaced in Azamgarh, questioning the MP's absence in the wake of police action on women protesting against the CAA and proposed NRC.

The posters, which have been put up by the minority cell of the Uttar Pradesh Congress, show Yadav with a black band on his mouth.

Nadeem, of the Congress minority cell, said, "The SP leader claims to be a well-wisher of Muslims but has confined himself to merely tweeting on the police action on the woman protesters."

He claimed that Yadav has not visited Azamgarh ever since the general election concluded last year.

In Bilariaganj area of the city, several Muslim women had started a protest at Maulana Jauhar park against the Citizenship (Amendment) Act and a pan-India National Register of Citizens (NRC) but were forcibly removed by police on Wednesday.

An FIR was registered against 35 named and over 100 unidentified people involved in the protests. Of them, 20 people were arrested, police had said.

Akhilesh has sent a party delegation to submit a report on the incident but has not visited the constituency himself.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.