ETV Bharat / business

డబ్ల్యూహెచ్‌ఓకు కీలకపత్రాలు సమర్పించిన భారత్​ బయోటెక్​ - కొవాగ్జిన్​ టీకా వినియోగం

కరోనా టీకా అయిన కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)కు అవసరమైన అన్ని పత్రాలు భారత్​ బయాటెక్ సమర్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Covaxin
కొవాగ్జిన్​
author img

By

Published : Jul 13, 2021, 5:26 AM IST

కొవాగ్జిన్‌ టీకా అత్యవసర ఉపయోగానికి సంబంధించి అనుమతుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అవసరమైన పత్రాలను సమర్పించినట్లు ఈ వ్యాక్సిన్ తయారీ సంస్ధ భారత్‌ బయోటెక్‌ తెలిపింది. వీలైనంత త్వరగా అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు.

భారత్‌ బయోటెక్‌ విజ్ఞప్తిపై నాలుగు నుంచి ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్​ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ కూడా తెలిపారు. ఈ అంశంపై తమ నిపుణుల కమిటీ సమీక్ష జరుపుతోందని వివరించారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో నూతన లేదా లైసెన్సు లేని ఔషధాలు/ టీకాలను ఒక క్రమపద్ధతిలో వినియోగించడానికి ఈయూఎల్‌ నిబంధనలను డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొచ్చింది.

ఇదీ చూడండి: విజృంభిస్తున్న జికా- 73 ఏళ్ల మహిళకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.