ఆధార్.. సిమ్‌కార్డ్ నుంచి పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్ వరకు ఇది చాలా అవసరం. భవిష్యత్‌లో అన్ని అవసరాలకు ఇది తప్పనిసరి కావచ్చు. అందువల్ల ఇది భారతీయులకు ముఖ్యమైన గుర్తింపు కార్డ్‌గా చెప్పొచ్చు. ఇంత ముఖ్యమైనదే అయినపట్టికీ వివిధ కారణాలతో ఇందులో ఫొటోలు అత్యంత తక్కువ క్వాలిటీతో ఉంటాయి. అందుకే ఆధార్ ఫొటోలపై మీమ్స్ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు ఆధార్ ఫొటోలో ఉన్నది మనమేనా? అని చాలా మంది అనుకునే ఉంటారు.
ఇందుకు గానూ ఆధార్‌లో ఫొటోను మార్చుకునే సౌకర్యం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ). ఆధార్‌ను జారీ చేసే ప్రభుత్వ రంగ సంస్థే ఈ యూఐడీఏఐ.
ఫొటో మార్చుకునేందుకు ప్రాసెస్ ఇలా..
- ఆధార్‌లో ఫొటో మార్చుకోవడం సులభమైన ప్రక్రియ. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
- ఫొటో ఛేంజ్ చేసుకునేందుకు ఓ ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి సులభంగా ఈ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- మీ వివరాలను నింపిన ఆ ఫారమ్‌ను తీసుకుని సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
- అక్కడ ఫొటో ఛేంజ్ కోసం రూ.100 రుసుము చెల్లించి రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.
- ఆధార్ నమోదు కేంద్రంలోని సిబ్బంది మీ ఫామ్‌లోని వివరాలను పరిశీలించి.. కొత్త ఫొటో తీసుకుని.. అప్డేట్కు పంపిస్తారు.
- ఈ ప్రక్రియతో మీ ఆధార్ నంబర్, ఇతర ఏ వివరాలు కూడా మారవు. కేవలం ఫొటో ఒక్కటే అప్డేట్ అవుతుంది.
- ఫొటో మారిన కొత్త కార్డు వారంలోపు మీ ఇంటికి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా వస్తుంది. అంతకు ముందే మారిన ఫొటోతో కూడిన ఆధార్‌ను.. అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకునే వీలుంది.
ఇదీ చదవండి:క్రెడిట్ కార్డు సైజులో ఆధార్.. అప్లై ఇలా..