ETV Bharat / business

స్థిరాస్తి రంగంపై కరోనా 2.0 పిడుగు! - corona effect on real estate business

గతేడాది కరోనా లాక్​డౌన్, తదనంతర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం బాగా దెబ్బతింది. 2020 రెండో అర్ధభాగంలో ఓ మోస్తారుగా కోలుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా ఎలా ఉంటుంది?

real estate sector, difficulties
కరోనా ఆంక్షలతో స్థిరాస్తి రంగానికి తప్పని కష్టాలు
author img

By

Published : Apr 26, 2021, 8:21 PM IST

ప్రస్తుతం కరోనా రెండో దశ ఉద్ధృతంగా మారుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీ పెరుగుతోంది. దీనితో ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, లాక్​డౌన్ తదితర ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా వైపు ఒత్తిడి ఇంకా పెరగవచ్చని చెప్తున్నారు.

గతేడాది కరోనా వచ్చిన సమయంలో లాక్​డౌన్ విధించటంలో స్థిరాస్తి రంగం ప్రతికూల ప్రభావం చవిచూసింది. అయితే కేవలం ఆరు నెలల వ్యవధిలో మంచి ప్రదర్శన కనబర్చింది. పలు సర్వేలు కూడా ఇదే విషయాలను వెల్లడించాయి. ఆనరాక్ చేసిన సర్వే ప్రకారం 2020 రెండో అర్ధ భాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. దీనికి బిల్డర్ల ఆఫర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మళ్లీ కరోనా విజృంభిస్తుండటం వల్ల మరోసారి స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది.

కార్మికుల లభ్యత తగ్గి...

చాలా రాష్ట్రాల్లో కరోనా రెండోదశ కొనసాగుతోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున కార్మికుల లభ్యత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆంక్షలు ఇందుకు అదనంగా ఉండనున్నాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు ఆలస్యంగా పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో పాటు సరఫరా తగ్గవచ్చు. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్ల కాలం కొనసాగుతోంది. కాబట్టి డిమాండ్ వైపు తగ్గుదల కనిపించినా కొన్ని విభాగాల్లో రికవరీ వేగంగా ఉండవచ్చని ఈ రంగంలోని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల డిమాండ్​కు సరిపడా ఇళ్లు లేకపోతే నగరాల్లో ధరలు పెరగవచ్చని స్థిరాస్తి అభివృద్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.

మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మొత్తంగా డిమాండ్ మళ్లీ తగ్గే అవకాశం ఉంది. అయితే అందుబాటు ధరల గృహాలు, మధ్యస్థాయి ధరల గృహాల్లో డిమాండ్ రికవరీ వేగంగానే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సబ్సిడీతో పాటు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఉండటమే దీనికి కారణమని నిపుణులు వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల చిన్న పట్టణాల్లో గృహాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉండనుంది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే స్థిరాస్తి రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కానీ పక్షంలో రెండేళ్ల కింద ఉన్న స్థాయికి ఈ రంగం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

2021 తొలి త్రైమాసికంలో సానుకూలం..

2020 మొదటి త్రైమాసికంతో పోల్చితే 2021లో తొలి మూడు నెలల్లో దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగినట్లు ఆనరాక్ అంచనా వేసింది. 2021 క్యూ1లో 58,290 ఇళ్లు విక్రయమయ్యాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 51 శాతం పెరిగింది. ఈ సమయంలో కొత్తగా 62,310 ఇళ్లకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. త్రైమాసికం వారీగా చూసుకుంటే విక్రయం కానీ ఇన్వెంటరీ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 1 శాతం మాత్రమే తగ్గింది. క్యూ1, 2020 లో 6.44 లక్షల యూనిట్లు విక్రయం కానీ ఇళ్లు ఉండగా... ఆ సంఖ్య క్యూ1, 2021లో 6.42 లక్షల యూనిట్లకు తగ్గింది.

కొత్తవి ఆలస్యం..

తక్కువ మానవ వనరులు ఉండటంతో స్థిరాస్తి అభివృద్ధిదారులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు మొగ్గు చూపుతారు. సమీప భవిష్యత్తులో ప్రారంభించాలనుకునే కొత్త ప్రాజెక్టులు నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టులు ప్రారంభించినా వాటి సంఖ్య తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కార్మికుల వలసలు, లాక్​డౌన్​లతో, తక్కువ మంది కార్మికులతో పని చేయటంతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మూడు నుంచి ఆరు నెలల ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న గృహాల డెలివరీ కూడా ఆలస్యం కావొచ్చు.

శివారు ప్రాంతాల ఇళ్లకు డిమాండ్

గత కొంత కాలంగా నగర శివారు ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగనున్న దృష్ట్యా వాటి డిమాండ్ తగ్గడంలేదని స్థిరాస్తి అభివృద్ధిదారులు భావిస్తున్నారు. వాణిజ్య స్థిరాస్తి మాత్రం ఇంకా కొంత కాలం ప్రతికూల ప్రభావాన్ని చవిచూడనుంది. గతేడాది నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్​తో వాణిజ్య స్థలాలతో స్థిరాస్తి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇది మరింత కాలం కొనసాగనుంది.

హైదరాబాద్ ప్రత్యేకత..

కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం దెబ్బతిన్నప్పటికీ.. మిగతా వాటితో పోల్చితే హైదరాబాద్​పై ప్రభావం చాలా తక్కువగా ఉందని స్థానిక స్థిరాస్తి అభివృద్ధిదారులు చెప్తున్నారు. కరోనా అనంతరం కూడా హైదరాబాద్ మిగతా నగరాలతో పోల్చితే మంచి ప్రదర్శన నమోదు చేసింది. అనరాక్ నివేదిక ప్రకారం క్యూ1, 2020తో పోల్చితే.. క్యూ1, 2021 లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల పెరుగుదల రేటులో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. 2020 జనవరి నుంచి మార్చి వరకు 2,680 ఇళ్ల విక్రయాలు నమోదవగా.. 2021లో అదే సమయంలో 4,400 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి.

హైదరాబాద్​లో 2021 మొదటి త్రైమాసికంలో కొత్తగా 12,620 ఇళ్లకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 2020లో జనవరి-మార్చి త్రైమాసికంలో కేవల 3,380 ఇళ్లకు సంబంధించిన ప్రాజెక్టులే కొత్తగా ప్రారంభమయ్యాయి. అంటే 273 శాతం పెరిగాయన్న మాట.

గతేడాది కూడా హైదరాబాద్​లో ధరలు పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో కూడా డిమాండ్ ఉంటుందని వారు భావిస్తున్నారు. హైదరాబాద్​లో మధ్య స్థాయి ఇళ్లకు డిమాండ్ బాగుందని వారు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల లాచింగ్ కూడా కొంత ఆలస్యం అవకాశం ఉందని వారు అంటున్నారు.

ఇదీ చూడండి: నిర్మాణరంగంపై రెండోదశ కరోనా ప్రభావం... సొంతూళ్లకు వలసకూలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.