ETV Bharat / business

సాంకేతిక సంస్థల్లో 'ఫిన్‌టెక్‌'లదే హవా! - ఫిన్​టెక్​ సంస్థల అభివృద్ధి

దేశంలో 'ఫిన్​టెక్' సంస్థలే వేగంగా వృద్ధి చెందుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 సాంకేతిక సంస్థల జాబితాను 'డెలాయిట్ టచీ తోమత్సు' విడుదల చేసింది. ఇందులో తొలి పది స్థానాల్లో ఉన్న సంస్థల ఆదాయం 2018-2020 మధ్య రూ.21 కోట్ల నుంచి రూ.400 కోట్లకు ఎగబాకింది.

fintech
సాంకేతిక సంస్థల్లో ఫిన్‌టెక్‌లదే హవా!
author img

By

Published : Mar 13, 2021, 5:40 AM IST

భారత్‌లో ఫిన్‌టెక్‌ సంస్థలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు డెలాయిట్‌ టచీ తోమత్సు ఇండియా ఎల్ఎల్‌పీ(డీటీటీఐఎల్‌ఎల్‌పీ) నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 50 సాంకేతిక సంస్థల జాబితాను డీటీటీఐఎల్‌ఎల్‌పీ విడుదల చేసింది. గత మూడేళ్లలో ఆయా సంస్థలు సాధించిన ఆర్థిక వృద్ధి ఆధారంగా జాబితాను రూపొందించారు.

ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న సంస్థల ఆదాయం 2018-2020 మధ్య రూ.21 కోట్ల నుంచి రూ.400 కోట్లకు ఎగబాకింది. అంటే దాదాపు 20 రెట్ల వృద్ధి నమోదైంది. ఇక తొలి ఆరు స్థానాల్లో రెండు ఫిన్‌టెక్ సంస్థలు ఉన్నాయి. అలాగే తొలి పది స్థానాల్లో ఉన్న సంస్థలు 13-70 రెట్ల వృద్ధిని నమోదు చేశాయి. తర్వాతి పది కంపెనీలు సైతం సగటున నాలుగు రెట్లు వృద్ధి చెందాయి. ఇక బెంగళూరు సాంకేతిక సంస్థలకు కేంద్రంగా నిలిచింది. 50 కంపెనీల్లో 18 బెంగళూరు కేంద్రంగానే పనిచేస్తున్నాయి.

ఇదీ చదవండి : మస్క్‌, బెజోస్‌ను మించి అదానీ సంపద వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.