ETV Bharat / business

కొవిడ్‌ ఔషధాల అనుమతుల్లో 6 ఫార్మా కంపెనీలు - Domestic pharma companies in corona Drug trails

కరోనా ఔషధం రేసులో ముందు వరుసలో ఉన్న ఆరు ఫార్మా కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ). ఆయా కంపెనీల ఔషధాలకు వేగంగా అనుమతులు ఇచ్చే ఉద్దేశంతో.. సంబంధిత తుది పత్రాలను సమర్పించాలని కోరింది. మైలాన్​, సిప్లా, హెటిరో వంటి ఫార్మా దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Drugs Controller General of India on Covid 19 Drug
కరోనా ఔషధం రేసులో ముందున్న కంపెనీలు
author img

By

Published : Sep 13, 2020, 10:07 AM IST

కొవిడ్‌-19 ఔషధాలకు వేగంగా అనుమతి ఇచ్చే ఉద్దేశంతో ఆరు ఫార్మా దిగ్గజాలను తమ తుది పత్రాలను సమర్పించాల్సిందిగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) కోరింది. ఆ జాబితాలో మైలాన్‌, సిప్లా, జుబిలెంట్‌, హెటెరో లాబ్స్‌, బయోస్పియర్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు ఔషధాలను తయారు చేస్తున్నాయి.

రెమ్‌డెసివిర్‌ 100 ఎంజీ/వయల్‌ ఇంజెక్షన్‌ను మరింత సమీక్షించేందు కోసం పోస్ట్‌ మార్కెటింగ్‌ సర్వేలెన్స్‌(పీఎంఎస్‌) ప్రోటోకాల్‌ను సమర్పించాలని మైలాన్‌, జుబిలెంట్‌లను ఇటీవల జరిగిన సమావేశంలో డీసీజీఐలోని నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) కోరింది. ఆ సమావేశంలో సిప్లా తన రెమ్‌డెసివిర్‌ 100 ఎంజీ/వయల్‌ ఇంజెక్షన్‌కు సంబంధించిన పీఎంఎస్‌ ప్రోటోకాల్‌ను సమర్పించింది.

లాక్సాయ్‌ లైఫ్‌ సైన్స్‌కు చెందిన ఉమిఫెనోవిర్‌, నఫామోస్టాట్‌, 5-ఏఎల్‌ఏ వంటి ఔషధాలకు అనుమతులు ఇవ్వడానికి ఎస్‌ఈసీ నిరాకరించింది. ఇవన్నీ భారత్‌లో ఏ వినియోగానికీ అనుమతించలేదన్న కారణాన్ని ఇందుకు చూపింది.

హెటెరో లాబ్స్‌కు ప్రతిపాదించిన రెమ్‌డెసివిర్‌ 100 ఎంజీ/వయల్‌ ఇంజెక్షన్‌కు పీఎంఎస్‌ను నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

ఇదీ చూడండి:'అనుమతిస్తే టీకా ట్రయల్స్ మళ్లీ ప్రారంభిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.