ఫావిపిరవిర్ డ్రగ్‌పై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతిచ్చింది. ఫావిపిరవిర్ 200 ఎంజీ మాత్రలపై ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు ఫార్మా దిగ్గజం 'డాక్టర్ రెడ్డీస్' ల్యాబరేటరీస్ చేసుకున్న అభ్యర్థనకు అంగీకారం తెలిపింది.
అయితే ఈ ప్రయోగాల్లో 50 శాతం ప్రభుత్వ ప్రదేశాల్లో నిర్వహించాలని ఆదేశించింది డీసీజీఐ. మరోవైపు ఫావిపిర్నవిర్ 600/800 ఎంజీ మాత్రలను తయారు చేసేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్‌కు అనుమతులు ఇచ్చింది డీసీజీఐ.
కరోనా రోగులకు ఔషధంగా ఈ ఫావిపిరవిర్‌ను ఉపయోగిస్తున్నారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు లక్షణాలు ఉన్న బాధితులకు వీటిని అందిస్తున్నారు.
ఇదీ చదవండి- బాబ్రీ కేసులో కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా: ఉమాభారతి